Begin typing your search above and press return to search.

14 రాత్రుళ్లు షూట్..సెట్ లో రోజూ 900 మంది!

సాయి శ్రీనివాస్, మంచు మ‌నోజ్, నారా రోహిత్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో `భైర‌వం` తెరకెక్కిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   18 May 2025 10:54 AM IST
14 రాత్రుళ్లు షూట్..సెట్ లో రోజూ 900 మంది!
X

సాయి శ్రీనివాస్, మంచు మ‌నోజ్, నారా రోహిత్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో `భైర‌వం` తెరకెక్కిన సంగ‌తి తెలిసిందే. ముగ్గురు క‌లిసి న‌టించడం ఇదే తొలిసారి. టాలీవుడ్ సినిమా పాన్ ఇండియాలో ట్రెండ్ సెట్ చేసిన నేప‌థ్యంలో యంగ్ హీరోల్లో సైతం చాలా మార్పులొచ్చాయి. సోలోగా క‌నిపిచండం కంటే ఒకే ప్రేమ్ లో ముగ్గురు న‌లుగురు న‌టిస్తే మార్కెట్ ప‌రంగా వ‌ర్కౌట్ అవుతుంద‌నే కొత్త స్ట్రాట‌జీని అనుస‌రించి ముందు కెళ్తున్నారు.

అయితే ఈ ముగ్గురు ఫాంలో లేని వాళ్లే. అలాంటి త్ర‌యం చేతులు క‌ల‌ప‌డంతో? ఏదో కొత్త‌గా ఓ ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని పాజిటివ్ బైబ్ సినిమాపై ఉంది. అయితే ఇది ఓ రీమేక్ చిత్ర‌మ‌ని బ‌య‌ట కొచ్చింది. `గ‌రుడ‌న్` అనే సినిమాకి రీమేక్ రూపం అని ద‌ర్శ‌కుడు విజ‌య్ క‌న‌క‌మేడ‌ల తెలిపాడు.`నాంది` సినిమాతో ఇత‌డికి మంచి పేరొచ్చింది. `భైర‌వం` అనే టైటిల్ స్టోరీ నుంచే వ‌చ్చిన‌ట్లు తెలిపాడు. సినిమా లో ఆధ్యాత్మిక అంశం మిళిత‌మై ఉంటుందన్నారు.

మూడు పాత్ర‌ల మ‌ధ్య సాగే ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇది. ఈ క‌థ జ‌రిగే గ్రామంలో ఓ గుడి ఉంటుంది. దాని క్షేత్ర పాల‌కుడు భైర‌వుడు. ఆ భైర‌వుడు అప్పుడ‌ప్ప‌డు బెల్లంకొండ పాత్ర‌ను ఆవ‌హిస్తుంటాడు. అలాంటి సంద ర్భంలో ఓ పెద్ద సంఘ‌ర్ణ‌ణ చోటు చేసుకుంటుంది. దాని వ‌ల్ల ముగ్గురు మిత్రుల జీవితాలు ఎలా మారాయి ? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మ‌లిచామ‌న్నారు. కొన్ని స‌న్నివేశాలు డిమాండ్ చేయ‌డంతో 14 రాత్రుళ్లు ప్ర‌త్యే కంగా షూట్ చేసాం.

రోజు రాత్రి 900 మంది జూనియ‌ర్ ఆర్టిస్టులు పాల్గొనే వారు. మూడు రాత్రుళ్లు ఇలాగే చేసాం. సెట్స్ లో డోర్స్ క్లోజ్ చేసి ప‌గ‌టి పూట వాటిని షూట్ చేయోచ్చు. కానీ స‌హ‌జ‌త్వం కోల్పోతామ‌ని అస‌లైన చీక‌ట్లోనే ఈ స‌న్నివేశాలు చిత్రీక‌రించామ‌న్నారు. త్వ‌ర‌లోనే సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.