మాస్ మల్టీస్టారర్ భైరవం.. ముగ్గురు మొనగాళ్లు రెడీ!
మే 30న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ కానున్న ఈ మల్టీస్టారర్, వేసవి చివరలో పెద్ద అట్రాక్షన్ గా నిలవనుంది.
By: Tupaki Desk | 9 May 2025 8:51 PM ISTఈ వేసవిలో పెద్ద సినిమాల జాబితాలో నిలిచిన మరో క్రేజీ ప్రాజెక్ట్ భైరవం’. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ లతో విభిన్నమైన కాంబినేషన్ లో వస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ కు మొదటి నుంచి పాజిటివ్ బజ్ కనిపిస్తోంది. ఇక సినిమా రిలీజ్ డేట్ విషయంలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక వాటన్నిటికి ఎండ్ కార్డ్ పెడుతూ మేకర్స్ ఒక మంచి పోస్టర్ ద్వారా రిలీజ్ విషయంలో ఒక క్లారిటీ ఇచ్చారు.
విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను, శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కెకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. పెన్ స్టూడియోస్కి చెందిన జయంతిలాల్ గడ ఈ సినిమాను ప్రెజెంట్ చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా రిలీజ్ చేసిన పోస్టర్ ఈ ఉత్సాహాన్ని మరింత పెంచేసింది. ఈ పోస్టర్లో బెల్లంకొండ శ్రీనివాస్ ను సెలబ్రేషన్స్ తో పైకి ఎత్తుతున్నట్టుగా మనోజ్, రోహిత్ కనిపిస్తున్నారు.
సాయి శ్రీనివాస్ గెలుపు మాస్ వాతావరణంలో డప్పుల మోతలతో ఊరేగింపు జరుగుతున్నట్టుగా చూపించడం అభిమానులను ఆకర్షిస్తోంది. ఈ విజువల్ చూస్తుంటే సినిమాకు ఉన్న సత్తా ఏంటో అర్థమవుతోంది. ముఖ్యంగా ఈ మల్టీస్టారర్ కాంబినేషన్ తెలుగు ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించే అంశం కాబోతోంది. ఇప్పటివరకు రిలీజైన రొమాంటిక్ సాంగ్, పవర్ఫుల్ డివోషనల్ సాంగ్ తో సంగీత విభాగం బలంగా నిలిచింది.
శ్రీచరణ్ పాకాల మ్యూజిక్, హరి కే వేదాంతం సినిమాటోగ్రఫీ, చోటా కే ప్రసాద్ ఎడిటింగ్, బ్రహ్మ కడాలి ప్రొడక్షన్ డిజైన్ లాంటి టెక్నికల్ విభాగాలు సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్థాయిని మేకర్స్ చెబుతున్నారు. హీరోయిన్ గా ఆదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్లై కనిపించబోతున్నారని మేకర్స్ వెల్లడించారు. ఇక ప్రమోషన్ల విషయానికి వస్తే.. సినిమా రిలీజ్ కి మూడు వారాలే ఉన్నందున, మరింత ఉత్సాహంగా ప్రచార కార్యక్రమాలను ప్లాన్ చేస్తున్నారు.
ఇప్పటి వరకూ వచ్చిన టీజర్, సాంగ్స్ తోనే బజ్ పెరిగినందున, మిగిలిన ఫ ప్రమోషన్ తో సినిమాకు మరింత హైప్ రాబట్టాలని టీం సిద్దమవుతోంది. మే 30న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ కానున్న ఈ మల్టీస్టారర్, వేసవి చివరలో పెద్ద అట్రాక్షన్ గా నిలవనుంది. ‘భైరవం’ పై ఉన్న ఈ క్రేజ్ చూసిన తర్వాత, ఈ సినిమా బాక్సాఫీస్ లో ఎలా కలెక్షన్ల వేట చేస్తుందో చూడాల్సిందే. హీరోల త్రయం, కథలో మాస్ యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్, టెక్నికల్ ప్రెజెంటేషన్ అన్నీ కలిస్తే, ఈ వేసవిలో పెద్ద సర్ప్రైజ్ ఇస్తుందన్నది ఇండస్ట్రీ టాక్.