గిచ్చామకు.. అంటూ భైరవం నుంచి మరో మాస్ బీట్
తెలుగు సినీ ప్రేక్షకులను ఊరిస్తోన్న మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘భైరవం’ ప్రమోషన్స్‌కు కొత్త ఊపొస్తోంది.
By: Tupaki Desk | 23 May 2025 7:09 PM ISTతెలుగు సినీ ప్రేక్షకులను ఊరిస్తోన్న మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘భైరవం’ ప్రమోషన్స్‌కు కొత్త ఊపొస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ వంటి మూడు పాపులర్ హీరోలు ఒకే ఫ్రేములో కనిపించనున్న ఈ భారీ మాస్ ఎంటర్టైనర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోగా, తాజా గా రిలీజ్ చేసిన మాస్ ఫోక్ సాంగ్ ‘గిచ్చమాకు’ సినిమాపై మరింత క్రేజ్ పెంచుతోంది.
శ్రీచరణ్ పాకల స్వరపరిచిన ఈ పాట మాస్ ఆడియెన్స్ ను కుదిపేస్తోంది. ధనుంజయ్ సీపాన, సౌజన్య భాగవతుల గాత్రంలో ఈ పాటకు ప్రత్యేకమైన జోష్, ఎనర్జీ అందింది. మాస్ బీట్‌లకు ఆకట్టుకునే లిరిక్స్ తో పాటు మెలోడీ టచ్ ఉన్న నేపథ్యం ప్రేక్షకుల్ని థియేటర్లలో డాన్స్ చేయించడమే కాకుండా టిక్‌టాక్, రీల్స్‌తో ట్రెండ్ అయ్యేలా తయారైంది.
ఈ పాట విజువల్స్ కూడా అలరిస్తున్నాయి. బెల్లంకొండ శ్రీనివాస్, అదితి శంకర్ జంటగా చేసిన ఎనర్జిటిక్ డ్యాన్స్ స్టెప్పులు సినిమాకే హైలైట్ అవుతాయని అర్ధమవుతుంది. ఈ పాటలోని పల్లవి నుంచి చరణం వరకు క్యాచీ మూమెంట్స్ అన్ని కూడా థియేటర్స్ లో విజిల్స్ వేయించేలా ఉన్నాయి. సినిమా మాస్ ఆడియెన్స్‌కి పండగగా మారేలా చేస్తుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అలాగే ఈ పాటే సినిమాలోని మాస్ మూమెంట్స్‌కు ఓ టర్నింగ్ పాయింట్ కానుందని మేకర్స్ చెబుతున్నారు.
విజయ్ కనకమేడల డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ రూరల్ యాక్షన్ డ్రామా భారీ స్థాయిలో నిర్మితమవుతోంది. KK రాధామోహన్ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం మే 30న గ్రాండ్ గా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్లు, పోస్టర్లు సినిమాపై బజ్ ని పెంచగా, లేటెస్ట్ గా ఈ పాటతో మాస్ జనాల హైప్ రెగ్యులర్‌గానే ట్రాక్‌లోకి వచ్చింది.
ఈ పాట విడుదల తర్వాత, మిగతా ప్రమోషన్లను మరింత వేగవంతం చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. సినిమా స్టోరీలైన్, మల్టీ స్టార్ కాంబినేషన్, మ్యూజిక్ మాస్ ఎలిమెంట్స్‌తో భైరవం సినిమా వేసవి థియేటర్లలో మాస్‌కి ఫెస్టివల్‌గా మారనుందని అనిపిస్తోంది. ‘గిచ్చమాకు’ పాటకు వచ్చిన రెస్పాన్స్ చూస్తే, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా హవా చూపడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. మరి సినిమాకు బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో చూడాలి.
