Begin typing your search above and press return to search.

భైరవం సెన్సార్ రిపోర్ట్.. సినిమా ఎలా ఉండబోతోందంటే?

తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డ్ నుంచి A సర్టిఫికెట్ను పొందిన భైరవం, ప్రేక్షకులకు సాలీడ్ యాక్షన్ ట్రీట్ అందించబోతుందని స్పష్టమైంది.

By:  Tupaki Desk   |   24 May 2025 3:20 PM IST
Mass Action Thriller Bhairavam Censor Completed
X

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కలిసి తొలిసారిగా స్క్రీన్‌పై కనిపించనున్న మాస్ యాక్షన్ మూవీ భైరవం మే 30న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామాలో అదితి శంకర్, దివ్యా పిళ్లై, ఆనంది కథానాయికలుగా నటిస్తున్నారు. తమిళ హిట్ సినిమా గరుడన్ కు ఇది తెలుగు రీమేక్ అయినప్పటికీ, కథలో చాలామేరకు మార్పులు చేసి తెలుగుకు తగ్గట్టుగా మలచినట్లు మేకర్స్ చెబుతున్నారు.

ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు భారీ స్పందన లభించింది. ప్రమోషన్ ఫేజ్‌లో భైరవం టీమ్ బిజీగా మారగా, యాక్షన్ కింగ్‌గా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాస్ లుక్‌, మ్యూజిక్, డైలాగ్స్, విజువల్స్ అన్నీ కలిపి సినిమాపై బజ్ పెంచాయి. ముఖ్యంగా ముగ్గురు హీరోల మాస్ ప్రెజెన్స్ సినిమాకు హైలెట్ గా నిలవనుందనే టాక్ వినిపిస్తోంది. సినిమా ప్రమోషన్స్ కూడా వైవిధ్యంగా డిజైన్ చేయడంతో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగింది.

తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డ్ నుంచి A సర్టిఫికెట్ను పొందిన భైరవం, ప్రేక్షకులకు సాలీడ్ యాక్షన్ ట్రీట్ అందించబోతుందని స్పష్టమైంది. సినిమా నిడివి 2 గంటల 35 నిమిషాలు ఉండనుండగా, యాక్షన్ డోస్ హై రేంజ్ లో ఉండబోతుందని అర్థమవుతోంది. క్లాస్, మాస్, కమర్షియల్ అంశాలతో మిక్స్ చేసి దర్శకుడు ఈ కథను తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది.

ఇన్ సైడ్ టాక్ ప్రకారం, ఈ సినిమాలో యాక్షన్ పార్ట్ బాగా పండింది. హీరోల మధ్య సీన్స్, విలన్ వర్సెస్ హీరో సన్నివేశాలు కూడా మంచి టెన్షన్‌ను కలిగించనున్నాయట. అంతేకాదు, ఎమోషనల్ సీన్స్ కూడా ఆకట్టుకునేలా డిజైన్ చేసినట్లు టాక్. ముఖ్యంగా బెల్లంకొండ శ్రీనివాస్ పాత్రలోని మార్పు, అతడి పెర్ఫార్మెన్స్ కీలక హైలైట్‌గా నిలుస్తుందట.

క్లైమాక్స్ విషయంలో మాత్రం దర్శకుడు పూర్తి బలంగా వర్క్ చేశారని సమాచారం. అలాగే చివర్లో ఎమోషనల్ సీన్స్ తో క్లైమాక్స్‌ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. చివరి 20 నిమిషాలు సినిమాకే హార్ట్ బీట్‌లా ఉంటుందని టాక్. అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఈ సినిమా ఉండబోతోందని యూనిట్ పూర్తి స్థాయిలో కాన్ఫిడెంట్‌గా ఉంది. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి.