Begin typing your search above and press return to search.

భైరవకొన బయటపడుతుందా?

విఐ ఆనంద్ సినిమాలు అంటే ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందనే టాక్ ఇండస్ట్రీలో ఉంది.

By:  Tupaki Desk   |   18 Nov 2023 4:21 PM GMT
భైరవకొన బయటపడుతుందా?
X

సందీప్ కిషన్ హీరోగా విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కి రిలీజ్ కి సిద్ధం అవుతోన్న మూవీ ఊరు పేరు భైరవకోన. కంప్లీట్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ఈ సినిమాని దర్శకుడు ఆనంద్ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించారు. విఐ ఆనంద్ సినిమాలు అంటే ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందనే టాక్ ఇండస్ట్రీలో ఉంది.భైరవకొన టైటిల్ తోనే క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. అయితే ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ కష్టాలు ఎదుర్కొంటోంది.

ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ సుంకర, రాజేష్ దండ ఈ సినిమాని నిర్మించారు. అయితే అతని నుంచి వరుసగా వచ్చిన ఏజెంట్, భోళా శంకర్ సినిమాలు డిజాస్టర్ గా మారాయి. ఈ రెండు సినిమాలతో భారీగా నష్టపోయారు. అలాగే ఈ సినిమాల కారణంగా బయ్యర్లతో కూడా గొడవలు అయ్యాయి. చాలా మంది డిస్టిబ్యూటర్స్ సినిమాకి వచ్చిన నష్టాల నుంచి తమని కాపాడాలంటూ నిర్మాతని డిమాండ్ చేశారు.

ఈ పంచాయితీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో నడుస్తోంది. ఇలాంటి సమయంలో భైరవకోన సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. కచ్చితంగా ఈ సినిమాని తక్కువ ధరకి తమకే ఇవ్వాలని ఏజెంట్ సినిమా డిస్టిబ్యూటర్స్ పట్టు పట్టే అవకాశం ఉంది. మరో వైపు డిసెంబర్ నెలలో వరుసగా సినిమాలు ఉన్నాయి. తరువాత జనవరిలో కూడా పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.

ఏదైనా మూవీకి పోటీగా రిలీజ్ చేస్తే ఓపెనింగ్స్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఇన్ని ఇబ్బందుల మధ్య సినిమాని ఎలా రిలీజ్ చేయాలో అనే దానిపై చిత్ర యూనిట్ టెన్సన్ పడుతోంది. అయితే జనవరి ఆఖరులో లేదంటే ఫిబ్రవరిలో కరెక్ట్ డేట్ చూసుకొని మూవీని రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. దానిపై ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు.

దర్శకుడు విఐ ఆనంద్ ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టాలనే కసితో ఉన్నారు. అలాగే మైఖేల్ డిజాస్టర్ కావడంతో భైరవకొనతో ట్రాక్ ఎక్కాలని సందీప్ కిషన్ ప్రయత్నం చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో తీసిన సినిమా కావడంతో నష్టాలు రాకుండా సక్సెస్ కొట్టి కాస్తా సేఫ్ జోన్ లోకి వెళ్లాలని నిర్మాతలు ఆలోచిస్తున్నారు.