Begin typing your search above and press return to search.

బాలయ్య క్లాసిక్‌ మూవీ రీ రిలీజ్‌ డేట్ కన్ఫర్మ్‌

వచ్చే నెల 5వ తారీఖున ఈ క్లాసిక్ మూవీ ని మళ్లీ విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది.

By:  Tupaki Desk   |   25 July 2023 6:03 AM GMT
బాలయ్య క్లాసిక్‌ మూవీ రీ రిలీజ్‌ డేట్ కన్ఫర్మ్‌
X

ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల సినిమాలు వరుసగా రీ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ నటించిన క్లాసిక్ మూవీ భైరవద్వీపం ఎప్పుడు ఎప్పుడు విడుదలవుతుందా అంటూ నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఎట్టకేలకు భైరవద్వీపం సినిమా ను రీ రిలీజ్ చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. వచ్చే నెల 5వ తారీఖున ఈ క్లాసిక్ మూవీ ని మళ్లీ విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. బాలకృష్ణ.. రోజా హీరో హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు.

సినిమాలోని కొన్ని సన్నివేశాలు ఇప్పటి తరం ప్రేక్షకులకు మాత్రమే కాకుండా ఫిలిం మేకర్స్ కి కూడా షాకింగ్ గా అనిపిస్తాయి. గ్రాఫిక్స్ లేని ఆ రోజుల్లో ఇంత అద్భుతంగా ఇలా సినిమా ను రూపొందించారంటూ ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతారంటే సందేహం లేదు.

సినిమా విడుదలై దాదాపు మూడు దశాబ్దాలు కాబోతున్న నేపథ్యంలో రీ రిలీజ్ కి సిద్ధమయ్యారు. రావి కొండలరావు విభిన్నమైన కథ స్క్రీన్ ప్లే తో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సింగీతం శ్రీనివాసరావు తన అద్భుతమైన డైరెక్షన్ మెలకువలతో అప్పట్లో ఒక వండర్ గా తీసిన సినిమా ను తీర్చిదిద్దారు.

కొన్ని సన్నివేశాల్లో బాలకృష్ణ ను కురూపిగా చూపించడం జరిగింది. ఆ సన్నివేశాలతో పాటు సినిమాలోని ప్రతి ఒక్క సన్నివేశం కూడా ఒక చందమామ కథ అన్నట్లుగా చిన్న పిల్లలకు అనిపిస్తుంది. కనుక భైరవద్వీపం నందమూరి బాలకృష్ణ అభిమానులకు మాత్రమే కాకుండా ప్రతి ఒక్క చిన్న పిల్లలకు కూడా చూపించాల్సిన సినిమా ఇది. ఆగస్టు 5వ తారీఖున విడుదల కాబోతున్న ఈ సినిమా భారీ వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి.