స్టార్ హీరోకు జోడీగా 'లెనిన్' భారతి?
ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఒక స్టార్ హీరో సినిమా కోసం ఈమెను హీరోయిన్‌గా పరిశీలిస్తున్నారని తెలుస్తోంది.
By: Ramesh Palla | 13 July 2026 9:00 PM ISTటాలీవుడ్‌లో భాగ్యశ్రీ బోర్సే ఎట్టకేలకు హిట్ కొట్టింది. 2024లో రవితేజతో కలిసి 'మిస్టర్ బచ్చన్' సినిమాలో నటించడం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన భాగ్యశ్రీ బోర్సే అందరి దృష్టిని ఆకర్షించింది. మొదటి సినిమాతోనే అందంతో మెప్పించిన ఈ అమ్మడు హిట్ మాత్రం కొట్టలేకపోయింది. మిస్టర్ బచ్చన్‌లో ఈమె పాత్ర పై విమర్శలు సైతం వచ్చాయి. టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా మారే అందం, ఫీచర్స్ భాగ్యశ్రీలో మెండుగా ఉన్నాయంటూ ఆ సమయంలోనే చాలా మంది కామెంట్స్ చేశారు. మొదటి సినిమా నిరాశ పరిచినప్పటికీ లక్కీగా ఈ అమ్మడికి విజయ్ దేవరకొండతో కలిసి కింగ్డమ్ సినిమాలో నటించే అవకాశం దక్కింది. ఆ సినిమా సైతం తీవ్రంగా నిరాశ ను మిగిల్చింది. కింగ్డమ్ సినిమాలో భాగ్యశ్రీ లుక్స్, రొమాన్స్ చర్చనీయాంశం అయ్యాయి. అందుకే మరిన్ని సినిమా ఆఫర్లు ఆమె తలుపు తట్టాయి అనడంలో సందేహం లేదు.
ఆంధ్రాకింగ్ తాలూక సినిమాలో హీరోయిన్‌గా...
గత సంవత్సరం రామ్‌తో కలిసి 'ఆంధ్రాకింగ్ తాలూక' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలోనూ భాగ్యశ్రీ అందంగా కనిపించి మెప్పించింది. తాజాగా అఖిల్ అక్కినేనితో కలిసి లెనిన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లెనిన్ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కమర్షియల్‌గా లెనిన్ రోజు రోజుకు స్ట్రాంగ్‌గా మారుతూ, బ్రేక్ ఈవెన్ దిశగా దూసుకు పోతుంది. దాంతో భాగ్యశ్రీ కి దక్కిన మొదటి కమర్షియల్ హిట్ అంటూ లెనిన్ గురించి నెటిజన్స్ మాట్లాడుకుంటూ ఉన్నారు. భాగ్యశ్రీ కి టాలీవుడ్ నుంచి ఆఫర్లు తగ్గుతున్నాయి అనుకుంటున్న సమయంలో లెనిన్‌తో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో వరుసగా ఈ అమ్మడికి ఆఫర్లు తలుపు తట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. లెనిన్ రిలీజ్ కావడమే ఆలస్యం ఈ అమ్మడి వద్దకు ఒక స్టార్ హీరో ప్రాజెక్ట్ వచ్చినట్లు సమాచారం అందుతోంది.
భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా...
ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఒక స్టార్ హీరో సినిమా కోసం ఈమెను హీరోయిన్‌గా పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. స్టార్ హీరో, ప్రముఖ దర్శకుడి కాంబోలో రాబోతున్న సినిమా కోసం ఇప్పటికే పలువురు కథనాయికలను పరిశీలించారు. ఒకరు ఇద్దరు కన్ఫర్మ్ అయినట్లే అంటూ వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ హిట్ కాంబోలో రూపొందబోతున్న మూవీ కోసం భాగ్యశ్రీని పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. నిర్మాత నాగవంశీ స్వయంగా భాగ్యశ్రీ పేరును ఆ దర్శకుడికి సూచించాడనే వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఆ విషయమై ఎలాంటి క్లారిటీ లేదు. ఆ యంగ్ స్టార్ హీరోకు జోడీగా భాగ్యశ్రీ నటిస్తే తప్పకుండా సినిమాకు ప్లస్ కావడం మాత్రమే కాకుండా భాగ్యశ్రీ టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ జాబితాలో చేరి పోవడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
టాలీవుడ్ స్టార్ హీరోకి జోడీగా భాగ్యశ్రీ బోర్సే...
భాగ్యశ్రీ బోర్సే గురించి సోషల్ మీడియాలో రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తూ ఉంటాయి. అందులో ఎంత నిజం అనే విషయం పక్కన పెడితే మోడలింగ్ పై ఆసక్తితో భాగ్యశ్రీ బోర్సే ముంబైలో బిజినెస్ మనేజ్‌మెంట్ చదివినట్లుగా తెలుస్తోంది. అక్కడ చదువు కొనసాగుతున్న సమయంలోనే మోడలింగ్ మొదలు పెట్టడం, సినిమాల్లో ఆఫర్లు రావడం జరిగిందట. 2024లో చందు ఛాంపియన్ మూవీతో బాలీవుడ్‌లో హీరోయిన్‌గా అడుగు పెట్టింది. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో టాలీవుడ్‌లోనూ ఈమె ఎంట్రీ ఇచ్చింది. భాగ్యశ్రీకి బాలీవుడ్‌లో నటించాలనే ఆసక్తి ఉందని, అయితే ప్రస్తుతానికి ఎక్కడ ఆఫర్లు వస్తే అక్కడ సినిమాలు చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది.
