Begin typing your search above and press return to search.

హిట్ కోసం రెండేళ్లు వెయిటింగ్.. ఇప్పుడు క్యూ కడుతున్నారా?

సినీ ఇండస్ట్రీలో టాలెంట్ ఒక్కటే సరిపోదు. దానికి తోడు సరైన విజయం అవసరమే. కొంతమందికి తొలి సినిమాతోనే స్టార్‌ డమ్ వస్తే, మరికొందరు హిట్ కోసం చాలా కాలం ఎదురుచూడాల్సి వస్తుంది.

By:  M Prashanth   |   18 July 2026 4:00 PM IST
హిట్ కోసం రెండేళ్లు వెయిటింగ్.. ఇప్పుడు క్యూ కడుతున్నారా?
X

సినీ ఇండస్ట్రీలో టాలెంట్ ఒక్కటే సరిపోదు. దానికి తోడు సరైన విజయం అవసరమే. కొంతమందికి తొలి సినిమాతోనే స్టార్‌ డమ్ వస్తే, మరికొందరు హిట్ కోసం చాలా కాలం ఎదురుచూడాల్సి వస్తుంది. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే జర్నీ దాదాపు అలాంటిదే. వరుస అవకాశాలు వచ్చినా, సరైన కమర్షియల్ సక్సెస్ మాత్రం దూరంగానే నిలిచింది. అయితే తాజాగా వచ్చిన లెనిన్ ఆమెకు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రిలీఫ్ ఇచ్చినట్లు కనిపిస్తోంది.

రవితేజ సరసన మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన భాగ్యశ్రీ, తొలి చిత్రంతోనే తన అందం, స్క్రీన్ ప్రెజెన్స్‌ తో ఆకట్టుకుంది. సినిమా ఆశించిన రిజల్ట్ అందుకోకపోయినా, ఆమెకు మాత్రం మంచి గుర్తింపు వచ్చింది. దీంతో టాలీవుడ్‌ లో వరుస అవకాశాలు దక్కాయి. ఆ తర్వాత కింగ్‌డ మ్, కాంతా, ఆంధ్ర కింగ్ తాలూకా వంటి ప్రాజెక్టుల్లో నటించినా, ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేకపోయాయి.

సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో హీరోయిన్ల కెరీర్‌ పై ఎఫెక్ట్ పడుతుంది. కానీ భాగ్యశ్రీ విషయంలో పరిస్థితి భిన్నంగా కనిపించింది. వరుస రిజల్ట్స్ అనుకూలంగా రాకపోయినా, దర్శక నిర్మాతలు ఆమెకు అవకాశాలు ఇస్తూనే వచ్చారు. దీనికి ప్రధాన కారణం ఆమెపై ఉన్న నమ్మకమేనని టాక్ వినిపిస్తోంది. తెరపై ఆమె కనిపించే తీరు, పాత్రలకు సరిపోయే లుక్, నటనలో చూపిస్తున్న డెవలప్మెంట్ వంటి అంశాలు ఆమెకు ప్లస్ అయ్యాయని అంటున్నారు.

అందుకే సినిమాల రిజల్ట్స్ తో సంబంధం లేకుండా కొత్త ప్రాజెక్టుల్లో ఆమె పేరు వినిపిస్తూనే వచ్చింది. ఇలాంటి సమయంలో విడుదలైన లెనిన్ సినిమా భాగ్యశ్రీ కెరీర్‌ లో కీలక మలుపుగా మారింది. ఆ చిత్రంలో ఆమె నటనకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో కూడా ఆమె పాత్ర గురించి పాజిటివ్ చర్చ సాగుతోంది.

దీంతో కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, నటిగా కూడా తన స్టామినా నిరూపించుకుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఆమె చేతిలో పలు చిత్రాలు ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా యంగ్ హీరోలు, మీడియం రేంజ్ చిత్రాల దర్శక నిర్మాతలు భాగ్యశ్రీని తమ ప్రాజెక్టులకు పరిశీలిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. రెండేళ్లుగా సరైన హిట్ కోసం ఎదురుచూసిన హీరోయిన్‌ కు వరుస ఛాన్సులు వస్తున్నాయట.

మరోవైపు శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కుతున్న సేయోన్ చిత్రంతో భాగ్యశ్రీ కోలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. తెలుగు సినిమాలే తన ఫస్ట్ ఫ్రిఫరెన్స్ అయినప్పటికీ, ఇతర భాషల్లోనూ అవకాశాలు రావడం ఆమె కెరీర్‌ కు మరింత బలం చేకూర్చే అవకాశం ఉందని చెప్పాలి. ఏదేమైనా హిట్ కోసం రెండేళ్లుగా ఎదురుచూసిన భాగ్యశ్రీకి లెనిన్ విజయం కొత్త జోష్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. వరుస ఫ్లాపుల మధ్య అవకాశాలు కోల్పోకుండా ముందుకు సాగిన ఆమెకు, లెనిన్ మూవీ కెరీర్‌ లో టర్నింగ్ పాయింట్‌ గా మారుతుందా లేదా అన్నది రాబోయే చిత్రాల రిజల్ట్స్ పై ఆధారపడి ఉంటుంది. అయితే ప్రస్తుతం మాత్రం టాలీవుడ్‌ లో ఆమె పేరు మళ్లీ గట్టిగానే వినిపిస్తోంది.