ఆ బ్యూటీకిదే చిట్ట చివరి అవకాశం!
పరిశ్రమలో నటి స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలంటే? గ్లామర్ మాత్రమే సరిపోదు. సరైన సమయంలో బలమైన హిట్ పడటం అంతకు మించి కీలకం.
By: Srikanth Kontham | 7 July 2026 9:00 PM ISTపరిశ్రమలో నటి స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలంటే? గ్లామర్ మాత్రమే సరిపోదు. సరైన సమయంలో బలమైన హిట్ పడటం అంతకు మించి కీలకం. ప్రస్తుతం యువ నటి భాగ్య శ్రీ బోర్సే విషయంలోనూ ఇదే జరుగుతోంది. అమ్మడు కెరీర్ నిర్ణయించే కీలకమైన మలుపు `లెనిన్` సినిమా రూపంలో ఆమె ముందుంది. వరుస అపజయాలతో ఇబ్బంది పడుతోన్న భాగ్య శ్రీ కి ఈ చిత్రం మేక్ ఆర్ బ్రేక్ ప్రాజెక్ట్‌గా మారింది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో హీరోయిన్ వరుసగా ప్లాపులు చూస్తే? దర్శక నిర్మాతలు తదుపరి సంప్రదించడానికి వెనకడుగు వేయడం సహజం.
భాగ్య శ్రీ బోర్సే కెరీర్‌లో ఇప్పటి వరకు వచ్చిన చిత్రాలు ఆశించిన స్థాయిలో ఫలితాలను ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో పరిశ్రమలో అమ్మడిపై ఉన్న నమ్మకం క్రమంగా తగ్గుతోందన్నది వాస్తవం. గ్లామర్ పరంగా మంచి మార్కులే వేసుకున్నప్పటికీ కమర్షియల్ సక్సెస్ లేకపోవడం అమ్మడిని తీవ్ర ఒత్తిడిలోకి నెట్టుతోంది. `లెనిన్` కథాంశం .. మేకింగ్ శైలిని బట్టి చూస్తే కచ్చితంగా భాగ్య శ్రీ నటనను నిరూపించుకునే మంచి అవకాశమే. ఈ చిత్రంలో భాగ్య శ్రీ పాత్రకు ప్రాధాన్యత ఉండటంతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు మెండుగా ఉన్నాయని టాక్ వినిపిస్తోంది.
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని సాధిస్తే భాగ్య శ్రీ స్టార్ హీరోయిన్ల రేసులో నిలబుతుంది. కొత్త అవకాశాలకు ఛాన్స్ ఉంటుంది. ఫలితం అటు ఇటు అయితే గనుక కెరీర్ కష్టతరంగా మారే అవకాశం ఉంది. వరుస ప్లాపులతో ఉన్న నటీమణులను తీసుకోవడానికి దర్శక, నిర్మాతలు సాహసించరు. ఈ క్లిష్ట సమయంలో భాగ్య శ్రీ బోర్సే పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను మెప్పించాల్సిన బాధ్యత ఆమెపైనే ఉంది. ఇప్పటి వరకూ అదృష్టంతో అవకాశాలు తలుపుతట్టినా? విజయం లేకపోతే ఇకపై ఆ పరిస్థితి ఉండదు. ఇండస్ట్రీలో గెలుపోటములు సహజమే అయినా? అవకాశాలు తగ్గుతున్నప్పుడు నటులు తమ పంథాను మార్చుకోవాలి.
భాగ్య శ్రీ విషయంలో కూడా పాత్రల ఎంపిక ..నటనలో మెరుగుదల అవసరం. `లెనిన్` ద్వారా తనలో నటిని పూర్తిగా ఆవిష్కరించగలిగితే సెకండ్ ఇన్నింగ్స్ జోరు అందుకునే ఛాన్స్ ఉంది. లెనిన్ ఒక అవకాశం మాత్రమే కాదు. కెరీర్ కంటిన్యూటీకి లైఫ్ లైన్ లాంటిది. `లెనిన్` విజయం భాగ్య శ్రీ బోర్సేకి కొత్త ఉత్సాహాన్ని, కొత్త అవకాశాలను తీసుకురావాలని ఆశిద్దాం. ఆమె ప్రతిభకు తగ్గ గుర్తింపు దక్కుతుందో లేదో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడక తప్పదు. సినీ ప్రేమికుల ఆదరణ లభిస్తే ఎలాంటి అపజయాల నుంచైనా? బయటపడొచ్చు. మరి భాగ్య శ్రీ బోర్సే అదృష్టం ఎలా ఉండో? చూడాలి.
