Begin typing your search above and press return to search.

స్టార్ హీరోల నుంచి నేర్చుకున్న పాఠాలను చెప్పిన భాగ్యశ్రీ!

మరాఠీ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నాల్లో బిజీగా ఉంది.

By:  Sravani Lakshmi Srungarapu   |   14 May 2026 10:32 AM IST
స్టార్ హీరోల నుంచి నేర్చుకున్న పాఠాలను చెప్పిన భాగ్యశ్రీ!
X

మరాఠీ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నాల్లో బిజీగా ఉంది. మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ యంగ్ హీరోయిన్‌కు తొలి సినిమా ఆశించిన విజయాన్ని అందించకపోయినా, ఆమె స్క్రీన్ ప్రెజెన్స్‌, గ్లామర్‌, డ్యాన్స్‌లకు మంచి స్పందన లభించింది. ఆ సినిమా తర్వాత వరుసగా పలు క్రేజీ ప్రాజెక్ట్‌లలో అవకాశాలు దక్కించుకున్న భాగ్యశ్రీ, యంగ్ హీరోలతో పాటు స్టార్ నటుల సరసన నటిస్తూ టాలీవుడ్‌లో తన స్థానం బలపరచుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న సినిమాలు కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.

మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ త‌ర్వాత భాగ్య‌శ్రీ విజయ్ దేవరకొండతో కింగ్‌డమ్, రామ్ పోతినేనితో ఆంధ్ర కింగ్ తాలూకా, అలాగే దుల్కర్ సల్మాన్‌తో చేసిన కాంత సినిమాలు ఆమెకు నటిగా మంచి గుర్తింపుని తీసుకొచ్చినా, కమర్షియల్‌గా మాత్రం పెద్ద విజయాలు అందించలేకపోయాయి. అయితే ఈ ప్రయాణంలో తనతో కలిసి పనిచేసిన హీరోల నుంచి ఎంతో నేర్చుకున్నానని తాజాగా భాగ్యశ్రీ చెప్పుకొచ్చింది.

రవితేజ నుంచి సహనం, సెట్స్‌లో ఆయ‌న చూపించే ఎనర్జీని నేర్చుకున్నానని ఆమె వెల్లడించింది. అలాగే విజయ్ దేవరకొండ సినిమాపై చూపించే ప్యాషన్‌, ప్రతి సన్నివేశాన్ని మెరుగ్గా చేయాలనే తపన తనను బాగా ప్రభావితం చేసిందని తెలిపింది. ఇక రామ్ పోతినేని గురించి మాట్లాడుతూ, ఆయన కేవలం స్టార్ హీరో మాత్రమే కాకుండా అద్భుతమైన డ్యాన్సర్‌, కష్టపడే నటుడని ప్రశంసించింది. ప్రతి షాట్‌కు ఆయన పెట్టే డెడికేషన్‌ చూసి తాను చాలా విషయాలు గ్రహించానని చెప్పింది. మరోవైపు దుల్కర్ సల్మాన్ గురించి మాట్లాడుతూ, ఇప్పటికే సీనియర్ నటుడైనా కొత్త నటుడిలా ప్రతి సన్నివేశాన్ని ఆసక్తిగా చూడటం తనకు ఆశ్చర్యం కలిగించిందని పేర్కొంది. తాను ఇప్ప‌టివ‌ర‌కు అద్భుత‌మైన కోస్టార్లతో క‌లిసి న‌టించాన‌ని భాగ్యశ్రీ అభిప్రాయపడింది.

ఇప్పుడు భాగ్యశ్రీ ఆశలన్నీ అఖిల్ అక్కినేనితో చేస్తున్న లెనిన్ సినిమాపైనే నిలిచాయి. ఈ సినిమా ఆమె కెరీర్‌కు కీలక మలుపు అవుతుందనే అభిప్రాయాలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఇప్పటికే వరుస సినిమాలతో బిజీగా ఉన్న భాగ్యశ్రీకి సరైన కమర్షియల్ హిట్ మాత్రమే కావాల్సి ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. లెనిన్ విజయం సాధిస్తే ఆమె టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ రేసులో మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నటిగా మంచి అవకాశాలు దక్కించుకుంటున్న భాగ్యశ్రీ, ఈసారి మాత్రం విజయాన్ని కూడా అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.