మిస్టర్ పర్ఫెక్ట్‌కి జోడీగా మిస్టర్ బచ్చన్ బ్యూటీ?
ప్రభాస్ చేయబోతున్న సినిమాల్లో స్పిరిట్ సినిమాతో పాటు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో చేయబోతున్న సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
By: Tupaki Desk | 30 April 2025 2:30 PMప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల జాబితా చాలా పెద్దగా ఉంది. ఇప్పటికే మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇదే ఏడాదిలో సినిమాను విడుదల చేసి తీరాలని మేకర్స్ పట్టుదలతో ఉన్నారు. ప్రభాస్ సైతం ఈ సినిమాను త్వరగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలంటూ ఇటీవల నిర్మాతలకు చెప్పాడని సమాచారం. మరో వైపు ఫౌజీ సినిమాను సైతం ప్రభాస్ చేస్తున్నాడు. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో ఫౌజీ సినిమా విడుదల ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలు కాకుండా మరికొన్ని సినిమాలు ప్రభాస్ లైన్‌లో పెట్టాడు.
ప్రభాస్ చేయబోతున్న సినిమాల్లో స్పిరిట్ సినిమాతో పాటు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో చేయబోతున్న సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. హనుమాన్ సినిమా తర్వాత ప్రశాంత్ వర్మ స్టార్‌డం అమాంతం పెరిగింది. ఆయన దర్శకత్వంలో సినిమాలు చేసేందుకు ప్రముఖ హీరోలు సైతం రెడీ అవుతున్నారు. ఆ మధ్య ఒక బాలీవుడ్ స్టార్‌తో సినిమాకు రెడీ అయిన ప్రశాంత్ వర్మ కొన్ని కారణాల వల్ల క్యాన్సల్ చేసుకున్నాడు. ఆ తర్వాత బాలకృష్ణ కొడుకును పరిచయం చేయబోతున్నాడు అనే వార్తలు వచ్చాయి. ఆ సినిమా కూడా పట్టాలెక్కలేదు. ప్రస్తుతం హనుమాన్ సీక్వెల్ చేస్తున్న ప్రశాంత్ వర్మ త్వరలోనే ప్రభాస్ సినిమాను మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి.
సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే ఏడాదిలో ప్రభాస్, ప్రశాంత్ వర్మ కాంబో మూవీ పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా మిస్టర్ బచ్చన్ సినిమాలో రవితేజకు జోడీగా నటించిన భాగ్యశ్రీ బోర్సే ను హీరోయిన్‌గా ఎంపిక చేశారని తెలుస్తోంది. ప్రభాస్ వంటి స్టార్ హీరోతో సినిమా లో నటించే అవకాశం దక్కడం అంటే కచ్చితంగా కెరీర్‌లో బిగ్ టర్న్ గా చెప్పుకోవచ్చు. చాలా ఆశలు పెట్టుకుని నటించిన మిస్టర్ బచ్చన్ సినిమా ఫెయిల్ కావడంతో తెలుగు లో ఈ అమ్మడికి ఎక్కువ ఆఫర్లు రాలేదు. చిన్నా చితకా ఆఫర్లు వస్తూ ఉంటే సున్నితంగా తిరస్కరిస్తూ వచ్చింది. ఎట్టకేలకు ఈ అమ్మడికి పెద్ద ఆఫర్ దక్కింది.
భాగ్య శ్రీ బోర్సే తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ. అందంతో పాటు నటిగా మంచి ప్రతిభ ఉన్న ముద్దుగుమ్మ. అందుకే ఈ అమ్మడికి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఒక్క హిట్ పడితే ఇండస్ట్రీలో ఈ అమ్మడు కచ్చితంగా మోస్ట్ బిజీ హీరోయిన్‌గా పేరు దక్కించుకోవడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడికి మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రభాస్‌తో నిజంగానే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా ఆఫర్ దక్కితే మాత్రం ఈ అమ్మడికి ముందు ముందు టాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియా రేంజ్లో పెద్ద సినిమాల్లో నటించే అవకాశాలు దక్కనున్నాయి. ప్రశాంత్ వర్మ సినిమాలో ఈమె నటించే విషయమై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.