Begin typing your search above and press return to search.

మీసాలు, కిరీటంతో భాగ్యశ్రీ.. ఏంటమ్మా ఈ న్యూ లుక్కు

ముఖ్యంగా ఆ సినిమాలో హీరోయిన్‌ గా నటిస్తున్న భాగ్యశ్రీ బోర్సే కొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.

By:  M Prashanth   |   6 May 2026 1:50 PM IST
మీసాలు, కిరీటంతో భాగ్యశ్రీ.. ఏంటమ్మా ఈ న్యూ లుక్కు
X

అక్కినేని వారసుడు అఖిల్ అక్కినేని హీరోగా, దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కిస్తున్న తాజా చిత్రం లెనిన్ ప్రస్తుతం టాలీవుడ్‌ లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా ఆ సినిమాలో హీరోయిన్‌ గా నటిస్తున్న భాగ్యశ్రీ బోర్సే కొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. ఇప్పుడు ఆ పోస్టర్ హాట్ టాపిక్ గా కూడా మారింది.




రాయలసీమ నేపథ్యంలో రూపొందుతున్న లెనిన్ చిత్రం లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్‌ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. సితార ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఆ సినిమా జూన్ 26న విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన వారేవా వారేవా పాట, అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. అఖిల్- భాగ్యశ్రీ కెమిస్ట్రీపై అభిమానులు పాజిటివ్‌ గా స్పందించారు.

ఇలాంటి సమయంలో భాగ్యశ్రీ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన కొత్త పోస్టర్ ఆసక్తి డబుల్ చేసింది. ఫస్ట్ లుక్ లో సాధారణంగా లంగాఓణీలో గ్రామీణ యువతిగా కనిపించిన ఆమె, ఇప్పుడు పూర్తిగా భిన్నమైన గెటప్‌ లో దర్శనమిచ్చారు. కిరీటం ధరించి, మీసాలతో యోధురాలిగా కనిపించిన ఆ లుక్ సినిమా స్టోరీ లైన్ పై కొత్త సందేహాలు రేకెత్తిస్తోంది.

భారతి అనే పాత్రలో నటిస్తున్న భాగ్యశ్రీ.. బర్త్ డే పోస్టర్‌ లో మైథలాజికల్, రాజుల కల్చర్ చెందిన శైలిని రిఫ్లెక్ట్ చేసేలా కనిపించింది. ఒకవైపు ప్రేమకథలో భాగమైన హీరోయిన్‌ గా కనిపిస్తూ, మరోవైపు ఇలాంటి యోధురాలి గెటప్‌ లో ఇప్పుడు కనపడడం కథలో టైమ్ ట్రావెల్ లేదా ఫ్లాష్‌ బ్యాక్ అంశాలు ఉన్నాయా అనే అనుమానాలను కలిగిస్తోంది. లేదా ఇది జస్ట్ రోల్ డెప్త్ కు ఒక సంబల్ గా ఉంటుందా అన్న చర్చ కూడా జరుగుతోంది.

సినిమా ప్రమోషన్స్ పరంగా చూస్తే.. భాగ్యశ్రీ బొర్సే లుక్ ఒక స్ట్రాటజిక్ మూవ్‌ గా కనిపిస్తోంది. సాధారణ లవ్ స్టోరీ అనుకున్న ప్రేక్షకులకు కొత్త యాంగిల్ చూపించడం ద్వారా సినిమాపై క్యూరియాసిటీ పెంచడమే మేకర్స్ టార్గెట్ గా తెలుస్తోంది. ముఖ్యంగా అఖిల్ గత చిత్రాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడం నేపథ్యంలో లెనిన్ హిట్ కావడం ఆయనకు చాలా కీలకం.

ఇక భాగ్యశ్రీ బోర్సే విషయానికి వస్తే, ఆమెకు కూడా లెనిన్ సినిమా ఒక టర్నింగ్ పాయింట్‌ గా మారే అవకాశం ఉంది. రవితేజతో చేసిన మిస్టర్ బచ్చన్ ద్వారా టాలీవుడ్‌ లో అడుగుపెట్టిన ఆమెకు తొలి చిత్రం నిరాశ కలిగించింది. తర్వాత చేసిన పాన్ ఇండియా ప్రాజెక్టులు కూడా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేకపోయాయి. దీంతో లెనిన్ ఆమెకు కీలక పరీక్షగా మారింది. అయితే భాగ్యశ్రీ ప్రతి సినిమాలో కొత్తగా కనిపించే ప్రయత్నం చేస్తుండటం ఆమెకు ప్లస్ పాయింట్‌ గా చెప్పుకోవచ్చు.

ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో భాగ్యశ్రీ నటించినవన్నీ డిఫరెంట్ రోల్సే. ఇప్పుడు లెనిన్ లో ఆమె పోషిస్తున్న భారతి పాత్ర కూడా అలాంటి వైవిధ్యాన్ని చూపిస్తోందని తాజా పోస్టర్ ద్వారా అర్థమవుతోంది. మొత్తానికి లెనిన్ సినిమా ఒక నార్మల్ రూరల్ లవ్ స్టోరీ కంటే ఎక్కువగా ఏదో స్పెషల్ ఎలిమెంట్ కలిగి ఉందని తెలుస్తోంది. మరి డిఫరెంట్ లుక్ వెనుక ఉన్న కథ ఏమిటి? సినిమా స్టోరీకి ఎలా కీలకమవుతుంది? అన్నది తెలుసుకోవాలంటే జూన్ 26 వరకు వేచి చూడాల్సిందే.