Begin typing your search above and press return to search.

కింగ్ డమ్.. హీరోయిన్ లవ్లీ డెడికేషన్

టాలీవుడ్‌లో ప్రస్తుతం అందరి ఫోకస్ విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన కింగ్డమ్ మూవీపైనే ఉంది.

By:  Tupaki Desk   |   26 July 2025 1:09 PM IST
Bhagyashri Borse Completes Dubbing for KINGDOM
X

టాలీవుడ్‌లో ప్రస్తుతం అందరి ఫోకస్ విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన కింగ్డమ్ మూవీపైనే ఉంది. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ పై విడుదలకు ముందే భారీ బజ్ నెలకొంది. టీజర్, పాటలు, ప్రమోషన్లతో సినిమాకు మంచి హైప్ వచ్చింది. ఇందులో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, ఆమె పాత్ర గురించి ప్రత్యేకంగా చర్చ జరుగుతోంది.

రీసెంట్‌గా చిత్ర బృందం ప్రమోషన్‌లో మరింత ఊపునిచ్చేలా ప్లాన్స్ స్టార్ట్ చేసింది. ఇక మరోవైపు భాగ్యశ్రీ బోర్సే చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమా త్వరలోనే విడుదల కానుండటంతో, భగ్యశ్రీ తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పూర్తిచేసింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేయగా, అభిమానులు ఎంతో ఎగ్జైట్ అయ్యారు.

కేవలం నటనలోనే కాదు, తనే సొంతంగా డబ్బింగ్ చెప్పడం ద్వారా భగ్యశ్రీ తన పాత్ర పట్ల ప్రేమను చూపించింది. చాలా మంది నాయికలు భాషా పరంగా ఇబ్బంది పడుతూ డబ్బింగ్ ఆర్టిస్టులను ఉపయోగిస్తుంటారు. కానీ భగ్యశ్రీ మాత్రం పూర్తి తెలుగు డైలాగ్స్‌కి స్వయంగా డబ్బింగ్ చెప్పడం స్పెషల్ హైలైట్ అయింది. కొత్త హీరోయిన్‌గా ఇండస్ట్రీకి వచ్చి, ఇంత డెడికేషన్ చూపించడం పై సినీ జనాల్లో కూడా ప్రశంసలు వినిపిస్తున్నాయి.

నటనతో పాటు డైలాగ్స్‌లో ఎమోషన్‌ను అద్భుతంగా ప్రెజెంట్ చేయడమే కాకుండా, తెలుగు డైలాగ్స్ ను కూడా కంటెంట్ కు తగ్గట్టుగా చెప్పినట్లు తెలుస్తోంది. భగ్యశ్రీ మాట్లాడుతూ, “ఒక సినిమాకు డబ్బింగ్ అనేది కేవలం లైన్స్ చెప్పడం కాదు. ప్రతి మాటలో భావాన్ని చూపించడం ముఖ్యం. తెలుగు భాషలో సొంతంగా వాయిస్ ఇవ్వడం నా లక్ష్యం. పాత్రలో జీవం పోసే అవకాశం డబ్బింగ్‌తో వచ్చింది” అని తెలిపింది. ఆమె మాటల్లోనూ, ప్రయత్నంలోనూ తెలుగు పట్ల ఉన్న ప్రేమ స్పష్టంగా కనిపిస్తోంది.

ఈ డెడికేషన్ వల్ల కింగ్‌డమ్ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ప్రేక్షకులు భగ్యశ్రీ నటనతో పాటు ఆమె వాయిస్ వినడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా విడుదల తర్వాత ఆమెకు టాలీవుడ్‌లో మరిన్ని అవకాశాలు రావొచ్చన్న అభిప్రాయం ఫిలిం వర్గాల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఓ నార్త్ ఇండియన్ హీరోయిన్ తెలుగులో ఇంత ప్రాముఖ్యత ఇవ్వడాన్ని సినీ ప్రియులు ప్రశంసించారు. ఇక కింగ్‌డమ్‌లో భగ్యశ్రీ బోర్సే ప్రదర్శన ఎలా ఉండబోతోందో తెలుసుకోవాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.