Begin typing your search above and press return to search.

రుక్మిణి భాగ్య శ్రీ.. ఫైట్ తప్పేలా లేదు..!

టాలీవుడ్ లో కొత్త అందాలు పలకరిస్తున్నాయి. తమ అందంతోనే కాదు అభినయంతో కూడా మెప్పించేందుకు హీరోయిన్స్ పోటీ పడుతున్నారు.

By:  Tupaki Desk   |   27 July 2025 7:00 PM IST
రుక్మిణి భాగ్య శ్రీ.. ఫైట్ తప్పేలా లేదు..!
X

టాలీవుడ్ లో కొత్త అందాలు పలకరిస్తున్నాయి. తమ అందంతోనే కాదు అభినయంతో కూడా మెప్పించేందుకు హీరోయిన్స్ పోటీ పడుతున్నారు. ఆల్రెడీ స్టార్ హీరోయిన్స్ గా ఉన్న వాళ్లు ఉన్నారు. వాళ్లకి పోటీగా కొత్త భామలు తమ సత్తా చాటాలని చూస్తున్నారు. ముఖ్యంగా నెక్స్ట్ రాబోయే సినిమాలతో ఇద్దరి భామల మధ్య టాలీవుడ్ లో గట్టి పోటీ ఉండేలా ఉంది. ఇంతకీ ఎవరా ఇద్దరు.. ఆ ఇద్దరి మధ్య పోటీ ఎందుకన్నది చూద్దాం.

బచ్చన్ బ్యూటీ భాగ్యం..

మిస్టర్ బచ్చన్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది భాగ్య శ్రీ బోర్స్. రవితేజ సరసన నటించిన ఈ అమ్మడు ఆ సినిమా తర్వాత వరుస ఛాన్స్ లు అందుకుంటుంది. త్వరలో కింగ్ డం తో రాబోతున్న అమ్మడు నెక్స్ట్ రాం ఆంధ్రా కింగ్ తాలూకా లో నటిస్తుంది. ఈ సినిమాలతో అమ్మడు కచ్చితంగా టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారుతుందని చెప్పొచ్చు.

దుల్కర్ సల్మాన్, రానా నటిస్తున్న కాంత సినిమాలో కూడా భాగ్య శ్రీ నటిస్తుంది. గ్లామర్ షో విషయంలో కూడా భాగ్యం వెనక్కి తగ్గేదేలే అన్నట్టుగా ఉంది. సినిమాలే కాదు సోషల్ మీడియాలో కూడా తన అప్డేట్స్ తో సత్తా చాటుతుంది అమ్మడు.

సప్త సాగరాల రుక్మిణి..

కన్నడ నుంచి వచ్చిన రుక్మిణి వసంత్ కి టాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. అమ్మడు నిఖిల్ తో అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమా చేసినా అది ఎవరు పట్టించుకోలేదు. కానీ అమ్మడు నెక్స్ట్ ఎన్ టీ ఆర్ తో డ్రాగన్ సినిమా చేస్తుంది. ఈ సినిమాను ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్నారు. తారక్ తో సినిమా అంటే రుక్మిణి రేంజ్ మారినట్టే లెక్క.

అదే కాదు మరో సినిమాకు రుక్మిణి వసంత్ డిస్కషన్ లో ఉందని టాక్. మొత్తానికి రుక్మిణి వసంత్ కూడా తెలుగులో మంచి అవకాశాలు అందుకుంటుంది. ఆల్రెడీ తమిళ్ లో సినిమాలు చేస్తున్న రుక్మిణి తెలుగులో కూడా తన సత్తా చాటాలని చూస్తుంది.

ఐతే భాగ్య శ్రీ, రుక్మిణి ఇద్దరు కూడా ఒకరికొకరు పోటీ పడేలా ఉన్నారు. ఇద్దరికి వరుస సినిమాలు మంచి క్రేజ్ తెస్తున్నాయి. ఆల్రెడీ టాప్ లో ఉన్న హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గకుండా ఈ ఇద్దరు పోటీ ఇచ్చేలా ఉన్నారు. కింగ్ డమ్ తో భాగ్య శ్రీ.. డ్రాగన్ తో రుక్మిణి ఇద్దరు కూడా టాప్ లీగ్ లోకి రావాలని చూస్తున్నారు. మరి ఈ ఇద్దరిలో ఎవరు ముందు ఎవరు వెనక అవుతారన్నది చూడాలి.