భాగ్యం వాటికి సై.. ఇక తిరుగులేదంతే..?
టాలీవుడ్ లో ఉన్న హీరోయిన్స్ కొరత గురించి తెలిసిందే. ఈ టైం లో కాస్త అందం అభినయం ఉండి ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేసే టాలెంట్ ఉంటే చాలు అలాంటి వారికి స్టార్ హోదా ఇచ్చేస్తున్నారు.
By: Tupaki Desk | 1 May 2025 4:00 AMటాలీవుడ్ లో ఉన్న హీరోయిన్స్ కొరత గురించి తెలిసిందే. ఈ టైం లో కాస్త అందం అభినయం ఉండి ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేసే టాలెంట్ ఉంటే చాలు అలాంటి వారికి స్టార్ హోదా ఇచ్చేస్తున్నారు. సరిగ్గా ఇలాంటి టైం లోనే వచ్చింది బాలీవుడ్ భామ భాగ్య శ్రీ బోర్స్. మాస్ మహరాజ్ రవితేజ చేసిన మిస్టర్ బచ్చన్ సినిమాతో అమ్మడు టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఐతే ఆ సినిమా ఫ్లాప్ అయినా అమ్మడికి వరుస ఛాన్స్ లు వస్తున్నాయి.
భాగ్య శ్రీ ప్రస్తుతం తెలుగులో ఇద్దరు స్టార్స్ తో నటిస్తుంది. ఆ రెండు సినిమాలు కూడా భారీ అంచనాలతో వస్తున్నాయి. అందులో ఒకటి విజయ్ దేవరకొండ ఒక సినిమా కాగా.. .. రెండోది రామ్ తో చేస్తున్న సినిమా. ఈ రెండు సినిమాల మీద భారీ హైప్ ఉంది. ఐతే రామ్ తో భాగ్యశ్రీ చేసే సినిమా లవ్ స్టోరీ అని తెలుస్తుంది. ఆ సినిమాలో వీరిద్దరి జోడీ అదిరిపోతుందట. ఈ సినిమా టైం లోనే రామ్ తో భాగ్య శ్రీ కాస్త క్లోజ్ గా ఉంటుందని.. ఇద్దరు ప్రేమలో పడ్డారన్నట్టు వార్తలు వచ్చాయి.
మరోపక్క విజయ్ దేవరకొండతో చేస్తున్న సినిమాకు అమ్మడు పూర్తి న్యాయం చేస్తుంది. ఈ సినిమాలో భాగ్య శ్రీ లిప్ లాక్స్ కూడా చేసిందని తెలుస్తుంది. విజయ్ దేవరకొండ సినిమాలో హీరోయిన్ తో లిప్ లాక్ ఇస్తే ఆ సినిమా హిట్ అయినట్టే. మొదట్లో ఈ సెంటిమెంట్ విజయ్ కి బాగా వర్క్ అవుట్ అయ్యింది. ఐతే ఆ తర్వాత హీరోయిన్ లిప్ లాక్స్ కూడా సక్సెస్ చేయలేదు.
ఐతే భాగ్య శ్రీ మాత్రం అవసరం ఐతే లిప్ లాక్ కి కూడా సిద్ధమే అని ప్రూవ్ చేసింది. లేటెస్ట్ గా విజయ్ దేవరకొండతో అమ్మడు లిప్ లాక్ చేసిన సాంగ్ రిలీజైంది. సో ఈ సాంగ్ ప్రోమో చూసిన ఆడియన్స్ భాగ్య శ్రీ ఇలా లిప్ లాక్స్ తో కూడా రెచ్చిపోతే మాత్రం ఇక అమ్మడికి టాలీవుడ్ లో టాప్ చెయిర్ ఇచ్చేయడం గ్యారెంటీ అనేస్తున్నారు. విజయ్, రామ్ సినిమాలతో పాటు దుల్కర్ సల్మాన్ తో భాగ్య శ్రీ కాంత సినిమా చేస్తుంది. ఆ సినిమాలో రామా కూడా నటిస్తున్నాడు.