భాగ్యం కాంతా కూడా ఈ ఇయర్ లోనే..?
ఇక ఈ సినిమా తర్వాత రామ్ తో ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా చేస్తుంది. ఆ సినిమాలో రామ్ కి తగిన జోడీగా కనిపించబోతుంది.
By: Tupaki Desk | 13 July 2025 11:00 AM ISTమిస్టర్ బచ్చన్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భాగ్య శ్రీ బోర్స్ ఆ సినిమాలో తన గ్లామర్ షోతో ఆడియన్స్ ని మెప్పించింది. సినిమా ఫ్లాపైనా సరే భాగ్య శ్రీకి వరుస ఛాన్స్ లు రావడానికి అది ఒక కారణం అయ్యింది. అంతేకాదు మిస్టర్ బచ్చన్ ప్రమోషన్స్ లో భాగ్య శ్రీ చూపించిన ఇంట్రెస్ట్ కూడా ఆఫర్లకు రీజన్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కింగ్ డం చేస్తున్న భాగ్య శ్రీ ఆ సినిమాతో ఈ నెల 31న రాబోతుంది.
ఇక ఈ సినిమా తర్వాత రామ్ తో ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా చేస్తుంది. ఆ సినిమాలో రామ్ కి తగిన జోడీగా కనిపించబోతుంది. ఈ రెండిటితో పాటు కాంతా అంటూ మరో పీరియాడికల్ కథలో నటిస్తుంది భాగ్య శ్రీ బోర్స్. ఈ సినిమాను సెల్వమని సెల్వరాజ్ తెలుగు, తమిళ్ రెండు భాషల్లో తెరకెక్కిస్తున్నారు.
దుల్కర్ సల్మాన్, రానా కలిసి నటిస్తున్న కాంతా సినిమాలో భాగ్య శ్రీ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ తోనే అమ్మడి కెరీర్ లో ఇది ప్రత్యేకమైన సినిమా అయ్యేలా ఉందని అనిపించింది. ఐతే భాగ్య శ్రీ కాంతా రిలీజ్ డేట్ ఎప్పుడన్నది క్లారిటీ రాలేదు. కింగ్ డమ్ ఈ నెల చివరన వస్తుంది.. నెక్స్ట్ రాం సినిమా కూడా మరో రెండు నెలల్లో రిలీజ్ ఉండొచ్చని అంటున్నారు.
ఇక ఈ సినిమాలే కాదు కాంతా సినిమా కూడా ఈ ఇయర్ లోనే రిలీజ్ ఉండే ఛాన్స్ ఉందట. సో ఒకే ఏడాదిలో 3 క్రేజీ సినిమాలు అవ్వడం స్టార్ హీరోయిన్స్ కి కూడా కుదరదు. అలాంటి భాగ్య శ్రీ కి ఒకే ఏడాది 3 సినిమాలు రిలీజ్ అవ్వడం తప్పకుండా కలిసి వచ్చే అంశమే అని చెప్పొచ్చు. భాగ్య శ్రీ బోర్స్ కూడా ఈ 3 సినిమాలతో తన సత్తా చాటాలని చూస్తుంది.
అందంతో మిస్టర్ బచ్చన్ లో మెప్పించిన భాగ్య ఇక రాబోతున్న సినిమాల్లో పర్ఫార్మెన్స్ తో కూడా ఆడియన్స్ ని అలరిస్తే మాత్రం టాలీవుడ్ లో కొన్నాళ్ల పాటు అమ్మడు తన ఫామ్ కొనసాగించే ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు. భాగ్య శ్రీ టాప్ ప్లేస్ కి వెళ్తే ఇప్పుడు స్టార్స్ గా ఉన్న హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
