ఆకాశంలో బచ్చన్ పాప రిస్కీ జంప్!
టాలీవుడ్‌లో ఉత్తరాది అందం భాగ్యశ్రీ బోర్సే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పూణేకు చెందిన ఈ ముద్దుగుమ్మ మోడలింగ్‌తో కెరీర్ ప్రారంభించి, 2023లో ‘యారియన్ 2’ హిందీ సినిమాతో నటిగా అరంగేట్రం చేసింది.
By: Tupaki Desk | 14 May 2025 12:30 PM ISTటాలీవుడ్‌లో ఉత్తరాది అందం భాగ్యశ్రీ బోర్సే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పూణేకు చెందిన ఈ ముద్దుగుమ్మ మోడలింగ్‌తో కెరీర్ ప్రారంభించి, 2023లో ‘యారియన్ 2’ హిందీ సినిమాతో నటిగా అరంగేట్రం చేసింది. ఆ తర్వాత కార్తీక్ ఆర్యన్ సరసన ‘చందు ఛాంపియన్’లో నటించి గుర్తింపు పొందింది. హరీశ్ శంకర్ దర్శకత్వంలో ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన భాగ్యశ్రీ, రవితేజ సరసన నటించి అందరి దృష్టిని ఆకర్షించింది.
ఆమె అందం, నటనతో యూత్‌ను ఆకర్షిస్తూ కొత్త స్టార్ హీరోయిన్‌గా స్థిరపడుతోంది. సోషల్ మీడియాలో భాగ్యశ్రీ బోర్సే యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులతో తన విశేషాలను పంచుకుంటుంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఆమె అందమైన ఫోటోలు, వీడియోలతో నిండి ఉంటుంది. ఆమె ట్రావెల్ అనుభవాలు, మోడలింగ్ షూట్స్, సినిమా అప్‌డేట్స్‌ను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌తో కనెక్ట్ అవుతోంది.
లేటెస్ట్ గా భాగ్యశ్రీ బోర్సే దుబాయ్ ట్రిప్‌లో స్కై డైవ్ చేసి సంచలనం సృష్టించింది. విమానం నుంచి కిలోమీటర్ల ఎత్తు నుంచి దూకి, ఆకాశంలో విహరించిన ఈ సాహసం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇలాంటి రిస్కీ స్టంట్‌లు చేయడానికి ఎంతో ధైర్యం, తెగువ కావాలి. భాగ్యశ్రీ ఈ సాహసాన్ని సేఫ్‌గా పూర్తి చేసి కిందకి దిగింది. ఈ స్కై డైవ్ వీడియోను భాగ్యశ్రీ సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది వైరల్‌గా మారింది.
“ఒకటే లైఫ్, ఒకటే శ్వాస, ఒకటే జంప్” అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను పోస్ట్ చేసింది. ఈ సాహసం చేయడం మగవాళ్లకే కష్టమైన విషయం, అలాంటిది ఓ హీరోయిన్ ఇలాంటి స్టంట్ చేయడంతో నెటిజన్లు ఆమెను మెచ్చుకుంటున్నారు. ఈ వీడియో ఆమె ధైర్యాన్ని, సాహసాన్ని చాటుతోంది. భాగ్యశ్రీ బోర్సే ఇప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోల సరసన నటిస్తూ బిజీగా ఉంది. దుల్కర్ సల్మాన్‌తో ‘కాంత’, రామ్ పోతినేనితో ఓ సినిమా, విజయ్ దేవరకొండతో ‘కింగ్‌డమ్’ సినిమాల్లో నటిస్తోంది. ‘కింగ్‌డమ్’ జులై 4న విడుదల కానుంది. ఈ సినిమాలతో భాగ్యశ్రీ మరింత స్టార్‌డమ్ సాధించే అవకాశం ఉంది.
