Begin typing your search above and press return to search.

భాగ్యశ్రీ బొర్సే పెళ్లి మ్యాటర్.. అంత చర్చ ఎందుకు?

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బొర్సే.. ఇప్పటి వరకు చేసింది నాలుగు సినిమాలే అయినా.. క్రేజ్ మాత్రం ఫుల్ గా సంపాదించుకుందనే చెప్పాలి.

By:  Tupaki Desk   |   29 Nov 2025 9:53 AM IST
భాగ్యశ్రీ బొర్సే పెళ్లి మ్యాటర్.. అంత చర్చ ఎందుకు?
X

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బొర్సే.. ఇప్పటి వరకు చేసింది నాలుగు సినిమాలే అయినా.. క్రేజ్ మాత్రం ఫుల్ గా సంపాదించుకుందనే చెప్పాలి. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన అమ్మడు.. బాలీవుడ్ లోకి తొలుత ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత మిస్టర్ బచ్చన్ మూవీతో హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయిన భాగ్యశ్రీ.. డెబ్యూపై నమ్మకం పెట్టుకున్నారు.

అందం, అభినయంతో ఆమె మెప్పించినా.. సరైన హిట్ మాత్రం దక్కలేదు. తొలి మూవీతోనే ఫ్లాప్ అందుకున్న భాగ్యశ్రీ.. స్పెషల్ ఫేమ్ అండ్ ఫ్యాన్ బేస్ ను మాత్రం సొంతం చేసుకున్నారు. మిస్టర్ బచ్చన్ తర్వాత కింగ్ డమ్ చేయగా.. ఆ సినిమా కూడా బాగా డిస్సపాయింట్ చేసింది. కచ్చితంగా హిట్ అందుకుంటారనుకున్నా అది జరగలేదు.

నవంబర్ లో దుల్కర్ సల్మాన్ తో చేసిన కాంత చిత్రం తో హిట్ కొట్టి సెట్ అవ్వాలనుకోగా.. కానీ ఆ మూవీ కూడా ప్రేక్షకుల అంచనాలను రీచ్ అవ్వలేకపోయింది. కాంతలో భాగ్యశ్రీ లుక్స్ కు ప్రశంసలు వచ్చినా.. హిట్ మాత్రం రాలేదు. ఇప్పుడు మూడు ఫ్లాపుల తర్వాత ఆంధ్రా కింగ్ తాలూకా చిత్రంతో ఫస్ట్ హిట్ అందుకున్నారు భాగ్యశ్రీ.

సినిమాలో మ‌హాల‌క్ష్మి పాత్ర‌లో మెప్పించిన ఆమె.. రెట్రో లుక్‌లో అచ్చ‌మైన తెలుగ‌మ్మాయిలా ఫిదా చేశారు. ముఖ్యంగా హీరో రామ్ పోతినేనితో క‌లిసి మంచి కెమిస్ట్రీ పండించిందని నెట్టింట అంతా కొనియాడుతున్నారు. అదే సమయంలో ఇప్పుడు సోషల్ మీడియాలో భాగ్యశ్రీ బొర్సే పెళ్లి కోసం జోరుగా డిస్కస్ చేసుకుంటున్నారు.

అయితే రామ్ తో ఆమె రిలేషన్ లో ఉన్నారని కొన్నిరోజులుగా ఊహాగానాలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. వాటిని ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ ప్రమోషన్స్ లో రామ్, భాగ్యశ్రీ ఖండించారు. తాము ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అని చెప్పారు. కానీ ఇప్పటికీ వారి మధ్య సమ్ థింగ్ ఉందని రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి.

ఇంకొందరు.. ఒక మెట్టు దాటి.. భాగ్యశ్రీ పర్సనల్ డిసిషెన్స్ పై కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడిప్పుడే కెరీర్ సెట్ అవుతున్న టైమ్ లో పెళ్లి చేసుకుంటే ఇబ్బంది పడుతుందని కామెంట్లు పెడుతున్నారు. అందుకే ఇప్పుడు పెళ్లి చేసుకోకపోవచ్చని మరికొందరు అంటున్నారు. అయితే అసలు భాగ్యశ్రీ పెళ్లి కోసం ఇప్పుడెందుకు చర్చ అని ఇంకొందరు నెటిజన్లు, సినీ ప్రియులు కౌంటర్ ఇస్తున్నారు. అనవసరమైన రూమర్లు, డిస్కషన్స్ ఎందుకని క్వశ్చన్ చేస్తున్నారు.