ఆ బ్యూటీ అప్పుడే పాన్ ఇండియాలోనా?
ఈ మధ్య కాలంలో లక్కీ హీరోయిన్ ఎవరైనా ఉన్నారు? అంటే అది భాగ్య శ్రీ బోర్సే అనడంలో ఎలాంటి సందేహం లేదు.
By: Tupaki Desk | 19 May 2025 7:00 PM ISTఈ మధ్య కాలంలో లక్కీ హీరోయిన్ ఎవరైనా ఉన్నారు? అంటే అది భాగ్య శ్రీ బోర్సే అనడంలో ఎలాంటి సందేహం లేదు. అమ్మడికి ఇంతవరకూ ఒక్క హిట్ సినిమా లేదు. చేసిన తొలి చిత్రం `మిస్టర్ బచ్చన్` ప్లాప్. ఆ సినిమా సెట్స్ లో ఉండగానే విజయ్ దేవరకొండ సరసన ఛాన్స్ అందుకుంది. అదే `కింగ్ డమ్`. గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై పాన్ ఇండియాలో భారీ అంచనాలున్నాయి.
సినిమా హిట్ అయితే భాగ్య శ్రీ రాత్రికి రాత్రే స్టార్ అయిపోతుంది. రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. హిట్ కే అవకాశాలు ఉన్నాయి. గౌతమ్ గత రెండుచిత్రాలు కూడా మంచి విజ యాలు అందుకున్నవే. ఈ నేపథ్యంలో `కింగ్ డమ్` హిట్ అంటూ టీమ్ అంతా కాన్పిడెంట్ గా ఉన్నా రు. ఇలాంటి సినిమాలో భాగ్య శ్రీ భాగమవ్వడంతో అప్పుడే హాట్ టాపిక్ గా మారిపోయింది.
తాజా న్యూస్ వింటే? దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం. ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసనే ఛాన్స్ అందుకుంది అన్న ప్రచారం ఠారెత్తిపోతుంది. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ వర్మ ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా భాగ్య శ్రీ బోర్సేని తీసుకుంటున్నట్లు సమా చారం. ఇప్పటికే ప్రశాంత్ వర్మ కొంత మంది భామల పేర్లు పరిశీలించారుట.
వారిపై లుక్ టెస్ట్ కూడా నిర్వహించారుట. వాటిలో భాగ్య శ్రీ తాను రాసుకున్న పాత్రకు పర్పెక్ట్ గా సూటవు తుందిట. ఈ నేపథ్యంలో ప్రశాంత్ సన్నిహితుల నుంచి ఆమె ఎంపిక దాదాపు ఖాయమనే మాట బలంగా వినిపిస్తుంది. చేతిలో ఎలాగూ కింగ్ డమ్ సినిమా ఉంది. హిట్ అయితే ప్రశాంత్ ప్రాజెక్ట్ కు అది కలిసొచ్చే అంశమే.
