హిట్ లేకుండా బిజీ అవ్వడం ఆమెకే చెల్లింది!
ఇండస్ట్రీ ఎప్పుడు సక్సెస్ వెంట మాత్రమే పరుగులు తీస్తుంది. ప్రతిభావంతులు కన్నా విజయతీరాన్ని చేరిన వారికే అవకాశాలు కల్పిస్తుంది.
By: Tupaki Desk | 7 May 2025 12:30 PMఇండస్ట్రీ ఎప్పుడు సక్సెస్ వెంట మాత్రమే పరుగులు తీస్తుంది. ప్రతిభావంతులు కన్నా విజయతీరాన్ని చేరిన వారికే అవకాశాలు కల్పిస్తుంది. హిట్ లేకుండా మరో సినిమాలో ఛాన్స్ అందుకోవడం అంటే అతి పెద్ద సవాల్. దాన్ని స్వీకరించడం అంత వీజీ కాదు. స్వీకరించినా? నిలబడటం అంత సులభం కాదు. కానీ ముంబై బ్యూటీ భాగ్య శ్రీ బోర్సే కి హిట్ అవసరం లేదు. ప్లాప్ ఉన్నా చాలా సినిమా వచ్చేస్తుందని ప్రూవ్ చేసింది.
ఈ అమ్మడు రవితేజ హీరోగా నటించిన `మిస్టర్ బచ్చన్` సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎలాంటి ఫలితాలు సాధించిందో తెలిసిందే. రవితేజ కెరీర్ లో మరో అతి పెద్ద డిజాస్టర్ ఇది. అయితే ఈ ప్లాప్ తో సంబంధం లేకుండా భాగ్య శ్రీ వరుసగా సినిమాలు చేస్తోంది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తోన్న `కాంత`లో నటిస్తోంది. అలాగే విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న `కింగ్ డమ్` లోనూ నటిస్తోంది.
ఇలా దుల్కర్, విజయ్ లకు జోడీగా హిట్ లేకుండా నటిస్తుంది. ఈ రెండు సినిమాలపై భారీ అంచనా లున్నాయి. ముఖ్యంగా కింగ్ డమ్ పై అసాధరణమైన అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే విడుద లైన ప్రచార చిత్రాలతో పీక్స్ కి చేరింది. అలాగే ఎనర్జిటిక్ స్టార్ రామ్ 22వ చిత్రంలోనూ ఈ భామనే హీరో యిన్. ఈ మూడు సినిమాలు హిట్ అయితే భాగ్య శ్రీ వేగాన్ని ఆపడం కష్టం.
కెరీర్ లో ఒక్క హిట్ లేకుండా ఇలా స్టార్ హీరోల సరసన ఛాన్స్ అంటే రాసి పెట్టి ఉండాలి. అది భాగ్య శ్రీకి నిండుగా రాసి పెట్టి ఉంది. ఒక్క ఛాన్స్ అంటూ ఎంతో మంది భామలు ప్రయత్నిస్తున్నా? ఛాన్సులు రావడం లేదు. భాగ్య శ్రీకి మాత్రం వెతుక్కుంటూ మరీ అవకాశాలు ఇంటి తలుపు తడుతున్నాయి.