Begin typing your search above and press return to search.

రెండేళ్ల దాకా భాగ్య శ్రీ బిజీ బిజీ..!

ఈ 3 సినిమాలతో భాగ్య శ్రీ ఆడియన్స్ కు మరింత దగ్గర కానుంది. ఐతే ఈమధ్య ఒక సినిమా కోసం భాగ్య శ్రీని దర్శక నిర్మాతలు కలిస్తే మరో ఆరు నెలల దాకా ఏమి చెప్పలేనని అన్నదట.

By:  Tupaki Desk   |   22 May 2025 1:00 PM IST
రెండేళ్ల దాకా భాగ్య శ్రీ బిజీ బిజీ..!
X

ఏ ముహుర్తాన తెలుగు తెరకు పరిచయం అవ్వాలని అనుకుందో కానీ ఇప్పుడు ఆమె నెక్స్ట్ స్టార్ హీరోయిన్ గా అవతరించబోతుంది. వరుస స్టార్ ఛాన్స్ లు ఆమెకు వస్తున్నాయి. ఇంతకీ ఎవరా లక్కీ హీరోయిన్ అని అనుకుంటున్నారు కదా ఇంకెవరు ఆమె మన భాగ్యం అదే అండి భాగ్య శ్రీ బోర్స్. బాలీవుడ్ లో ఒక సినిమా చేసిన ఆమె మన డైరెక్టర్ హరీష్ శంకర్ దృష్టిలో పడింది. ఆయన సినిమాల్లో హీరోయిన్స్ కి మంచి క్రేజ్ ఉంటుంది. అంతేకాదు హరీష్ శంకర్ హిట్ ఇచ్చిన హీరోయిన్స్ కెరీర్ టాప్ రేంజ్ కి వెళ్తుంది.

శృతి హాసన్, పూజా హెగ్దే లాంటి హీరోయిన్స్ కి మొదటి బ్రేక్ ఇచ్చిన డైరెక్టర్ ఆయనే. భాగ్య శ్రీ ని కూడా మిస్టర్ బచ్చన్ సినిమాతో పరిచయం చేసిన హరీష్ శంకర్ ఆమె లోని గ్లామర్ యాంగిల్ తో ఆడియన్స్ ని ఫిదా చేశాడు. ఐతే మిస్టర్ బచ్చన్ సినిమా కమర్షియల్ గా వర్క్ అవుట్ కాలేదు. అయినా సరే భాగ్య శ్రీకి వరుస అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం అమ్మడు మూడు క్రేజీ సినిమాలతో బిజీగా ఉంది.

అందులో ఒకటి విజయ్ దేవరకొండ కింగ్డమ్ కాగా మరోటి ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో చేస్తున్న ఆంధ్రా కింగ్ తాలూకా ఉంది. ఈ రెండిటితో పాటు దుల్కర్ సల్మాన్ రానా నటిస్తున్న కాంత సినిమా కూడా తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్వల్ మూవీగా వస్తుంది. ఈ 3 సినిమాలతో భాగ్య శ్రీ ఆడియన్స్ కు మరింత దగ్గర కానుంది. ఐతే ఈమధ్య ఒక సినిమా కోసం భాగ్య శ్రీని దర్శక నిర్మాతలు కలిస్తే మరో ఆరు నెలల దాకా ఏమి చెప్పలేనని అన్నదట.

ఆల్రెడీ అమ్మడికి మరో రెండు సినిమాలు లైన్ లో ఉన్నాయి. సో హిట్ లేకపోయినా సక్సెస్ ఖాతా తెరవకపోయినా కూడా భాగ్య శ్రీ డిమాండ్ అలా ఉంది. భాగ్య శ్రీ మూమెంట్ చూస్తుంటే తప్పకుండా టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్టార్ మెటీరియల్ అయిన ఈ అమ్మడిని మన మేకర్స్ ఏమేరకు ఆమె టాలెంట్ వాడుకుంటారన్నది చూడాలి. రాబోతున్న మూడు సినిమాల్లో ఒక్కటి హిట్టు పడినా కూడా భాగ్య శ్రీని ఆపడం ఎవరి వల్లా కాదని చెప్పొచ్చు.