ఎవరికీ తెలియని విషయాలను వెల్లడించిన బచ్చన్ పాప
ఈ సాంగ్ మొదట్లో విజయ్ దేవరకొండ పేరు సూరి అని, అతను, భాగ్యశ్రీ లవర్స్ గా నటిస్తున్నారని అర్థమవుతుంది.
By: Tupaki Desk | 6 May 2025 2:30 AMవిజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కింగ్‌డమ్ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. తాను హీరోయిన్ అవాలని డిసైడైనప్పుడు పాటలు వింటూ సీన్స్ ను ఊహించుకునేదాన్నని ఎవరికీ తెలియని విషయాన్ని బయటపెట్టింది బచ్చన్ పాప.
తాను ఆ పాటలు వినేటప్పుడే తనక్కూడా ఒక రోజు వస్తుందని, ఆ రోజు తనకంటూ సొంత పాటలుంటాయని, కేవలం బీజీఎం మాత్రమే కాకుండా పాటలకు కూడా తాను ప్రాణం పోస్తానని తనకు తెలుసని చెప్పిన తనకు తాను కలలు కనడం లేదని కూడా అప్పుడే తెలుసని, తానేంటో తనకు తెలుసని చెప్పిన భాగ్యశ్రీ హృదయం లోపల లాంటి సాంగ్ ఇచ్చినందుకు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కు థాంక్స్ తెలిపింది.
విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ పై షూట్ చేసిన ఈ సాంగ్ రీసెంట్ గా రిలీజై అందరి నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. మరీ ముఖ్యంగా సాంగ్ మధ్యలో ఇద్దరి మధ్య వచ్చే డైలాగ్స్ ఆడియన్స్ కు సినిమా కథ గురించి కీలక వివరాలను తెలిసేలా చేస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతుంది.
ఈ సాంగ్ మొదట్లో విజయ్ దేవరకొండ పేరు సూరి అని, అతను, భాగ్యశ్రీ లవర్స్ గా నటిస్తున్నారని అర్థమవుతుంది. అయితే వీరిద్దరూ ఏదో పెద్ద మిషన్ కోసం కలిసి ఉన్నట్టు తెలుస్తోంది కానీ ఆ మిషన్ ఏంటనేది మాత్రం తెలియడం లేదు. ఈ సినిమాలో భాగ్యశ్రీ ఓ డాక్టర్ గా కనిపించగా, సూరి జనాలను చంపే బిజినెస్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇద్దరూ ఒంటరిగా ఉన్నప్పుడు నిరంతరం దూరంగా ఉంటారు కానీ సాంగ్ అయిపోయే టైమ్ కు ఈ జంట ఒకరినొకరు ప్రేమించుకున్నట్టు అనిపిస్తుంది.
అనిరుధ్ సంగీతం అందించిన ఈ పాటకు కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా, అనిరుధ్, అనుమిత పాటను పాడారు. మే 30న రిలీజ్ కానున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగ వంశీ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాపై నిర్మాత నాగవంశీ, హీరో విజయ్ దేవరకొండ ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నారు.