Begin typing your search above and press return to search.

లెనిన్ కోసం భాగ్య శ్రీ వెయిటింగ్..!

ఆంధ్రా కింగ్ లో భాగ్య శ్రీ లుక్స్ ఆకట్టుకున్నాయి. ఐతే అమ్మడు నెక్స్ట్ అక్కినేని అఖిల్ తో లెనిన్ సినిమా చేస్తుంది.

By:  Ramesh Boddu   |   29 Dec 2025 12:00 PM IST
లెనిన్ కోసం భాగ్య శ్రీ వెయిటింగ్..!
X

అందం, అభినయం ఉన్నా కూడా హిట్ అందుకోవడంలో కాస్త వెనుకబడి ఉంది అందాల భామ భాగ్య శ్రీ బోర్స్. పర్ఫెక్ట్ స్టార్ హీరోయిన్ మెటీరియల్ అయిన ఈ అమ్మడు తొలి సినిమా మిస్టర్ బచ్చన్ తోనే యూత్ ఆడియన్స్ కి హాట్ ఫేవరేట్ అయ్యింది. మిస్టర్ బచ్చన్ సరిగా మెప్పించలేకపోయినా విజయ్ దేవరకొండ కింగ్ డం తో సత్తా చాటుతుందని అనుకోగా ఆ సినిమాలో ఆమెది హీరోయిన్ కి తక్కువ సైడ్ రోల్ కి ఎక్కువ అన్నట్టుగా చేశారు. కనీసం ఆ సినిమాలో హీరో హీరోయిన్ మధ్య ఉన్న సాంగ్ కూడా తీసేసి భాగ్య శ్రీ ఫ్యాన్స్ ని హర్ట్ అయ్యేలా చేశారు.

రామ్ తో చేసిన ఆంధ్రా కింగ్ తాలూకా..

ఆ సినిమా రిజల్ట్ ని ఊహించని భాగ్య శ్రీ కాస్త అప్సెట్ అయ్యింది. ఐతే నవంబర్ లో రెండు వారాల గ్యాప్ లో రెండు సినిమాలతో అలరించింది భాగ్య శ్రీ. అందులో ఒకటి కాంత కాగా మరొకటి రామ్ తో చేసిన ఆంధ్రా కింగ్ తాలూకా. రామ్ సినిమా కాస్త సందడి చేసినా కాంత ఎలా వచ్చిందో అలానే వెళ్లింది. ఆంధ్రా కింగ్ తాలూకా మంచి సినిమానే కానీ అది ఎందుకో ఆడియన్స్ సరిగా రిసీవ్ చేసుకోలేదు.

ఆంధ్రా కింగ్ లో భాగ్య శ్రీ లుక్స్ ఆకట్టుకున్నాయి. ఐతే అమ్మడు నెక్స్ట్ అక్కినేని అఖిల్ తో లెనిన్ సినిమా చేస్తుంది. చేస్తున్న సినిమాలన్నీ రిలీజ్ ముందు బజ్ రావడం ఆఫ్టర్ రిలీజ్ నీరస పడేలా చేయడం భాగ్య శ్రీ కెరీర్ లో ఇప్పటి వరకు అది రిపీట్ అవుతూ వచ్చింది. ఐతే లెనిన్ విషయంలో అది జరగకూడదని అనుకుంటుంది భాగ్యం. కాంత, ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా ఆమె గ్లామర్ తో పాటు యాక్టింగ్ టాలెంట్ ని ఆడియన్స్ గుర్తించారు.

లెనిన్ తో కమర్షియల్ హిట్ పడితే..

సో లెనిన్ తో కమర్షియల్ హిట్ పడితే అమ్మడు తిరిగి ఫాంలోకి వచ్చినట్టే అవుతుంది. అందుకే లెనిన్ సినిమా కోసం భాగ్య శ్రీ ఆసక్తిగా ఎదురుచూస్తుంది. అసలైతే అఖిల్ లెనిన్ కూడా నవంబర్ రిలీజ్ ప్లాన్ చేశారు కానీ పోస్ట్ ప్రొడక్షన్ ఇంకా కాస్త షూటింగ్ అవ్వకపోవడంతో నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి లేదా సమ్మర్ రిలీజ్ అనుకుంటున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ కలిసి లెనిన్ సినిమా నిర్మిస్తున్నారు.

మురళి కిషోర్ అబ్బూరు డైరెక్ట్ చేస్తున్న లెనిన్ సినిమా నుంచి అప్పట్లో వచ్చిన టీజర్ ఇంప్రెస్ చేసింది. ఈ సినిమాలో ముందు హీరోయిన్ గా శ్రీలీలను అనుకోగా ఆమెతోనే టీజర్ వదిలారు. కానీ కొంత షెడ్యూల్ అయ్యాక శ్రీలీల డేట్స్ అడ్జెస్ట్ అవ్వట్లేదని ఆమె ప్లేస్ లో భాగ్య శ్రీని తీసుకున్నారు. మరి భాగ్య శ్రీ ఎదురుచూస్తున్న హిట్ సినిమా లెనిన్ అవుతుందా లేదా అన్నది ఆ సినిమా రిలీజ్ అయ్యాక తెలుస్తుంది.