Begin typing your search above and press return to search.

భగవంత్ బాక్సాఫీస్.. ఇప్పటివరకు ఎంత వచ్చాయంటే..

నందమూరి బాలకృష్ణ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన భగవంత్ కేసరి సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకుంటున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   30 Oct 2023 7:28 AM GMT
భగవంత్ బాక్సాఫీస్.. ఇప్పటివరకు ఎంత వచ్చాయంటే..
X

నందమూరి బాలకృష్ణ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన భగవంత్ కేసరి సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకుంటున్న విషయం తెలిసిందే. ఇక నిన్నటితో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి 11 రోజులు పూర్తయింది. మొదట్లోనే మంచి ఓపెనింగ్స్ అందుకున్న ఈ సినిమా పండగ సీజన్ తర్వాత కూడా అదే తరహాలో కలెక్షన్స్ రాబడుతూ వస్తోంది.

ఈ సినిమాలో శ్రీలీల మంచి ఎనర్జిటిక్ క్యారెక్టర్ లొనే ఒక ఎమోషనల్ మూమెంట్స్ తో కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. కాజల్ అగర్వాల్ బాలయ్య బాబుకి జోడిగా స్పెషల్ పాత్రలో మెప్పించింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రెండు రోజులలో ఎంత కలెక్షన్స్ అందుకుంది అనే వివరాలలోకి వెళితే.. భగవంతుడు కేసరి సినిమాకు ఎక్కువగా మాస్ ఏరియాల లో సాలిడ్ కనెక్షన్స్ వచ్చాయి.

నైజంలో 16.66 కోట్లు రాగా ఉత్తరాంధ్రలో 5.83 కోట్లు, సీడెడ్ లో 13 కోట్లు, నెల్లూరులో 2.26 కోట్లు, ఈస్ట్ లో 3.09 కోట్లు, వెస్ట్ లో 2.64కోట్లు, కృష్ణాలో 3.26 కోట్లు, గుంటూరులో 5.57 కోట్లు, కర్ణాటక అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తంగా 5.30 కోట్లు వచ్చాయి. ఓవర్సీస్ లో ఈ సినిమా 7.96 కోట్లు రాబట్టింది.

ఇక మొత్తంగా 11 రోజుల్లో భగవంత్ కేసరి ప్రపంచ వ్యాప్తంగా 65.40 కోట్ల షేర్ కలెక్షన్స్ రాబట్టింది. అంటే 130.01 కోట్ల గ్రాస్ వచ్చింది. బాలయ్య బాబు కెరీర్ లోనే అత్యధిక స్థాయిలో షేర్ కలెక్షన్స్ అందుకున్న సినిమాల్లో భగవంత్ కేసరి కూడా ఒకటిగా గెలిచింది. షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్లో సాహు నిర్మించిన ఈ సినిమాలో బాలయ్య బాబు రెండు డిఫరెంట్ షేడ్స్ కనిపించి ఎంతగానో ఆకట్టుకున్నారు.

ముఖ్యంగా పోలీస్ క్యారెక్టర్ తో కూడా బాలకృష్ణ కనిపించిన విధానం ఫాన్స్ చేత విజిల్స్ వేయించింది. గతంలో ఎప్పుడు లేనంత డిఫరెంట్ గా ఈ సినిమాతో బాలయ్య మెప్పించాడు అని పాజిటివ్ కామెంట్స్ అయితే వస్తున్నాయి. ఇక భగవంత్ కేసరి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్ అందుకోవడంతో ఈ కాంబినేషన్ మరొకసారి రిపీట్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. బాలకృష్ణ ప్రస్తుత బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. అలాగే బోయపాటితో కూడా మరో సినిమా చేసేందుకు చర్చలు జరుపుతున్నాడు. ఇక ఇదే క్రమంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో కూడా మరొక డిఫరెంట్ సినిమా చేయడానికి బాలయ్య బాబు ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం.