Begin typing your search above and press return to search.

భగవంత్ కేసరికి అదనపు ఆకర్షణ.. ఫ్యాన్స్​లో ఫుల్ జోష్​

నందమూరి నటసింహం బాలకృష్ణ- దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన భగవంత్ కేసరి.. తాజాగా విడుదలై దసరా బాక్సాఫీస్​ విన్నర్​గా నిలిచింది

By:  Tupaki Desk   |   24 Oct 2023 4:53 AM GMT
భగవంత్ కేసరికి అదనపు ఆకర్షణ.. ఫ్యాన్స్​లో ఫుల్ జోష్​
X

నందమూరి నటసింహం బాలకృష్ణ- దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన భగవంత్ కేసరి.. తాజాగా విడుదలై దసరా బాక్సాఫీస్​ విన్నర్​గా నిలిచింది. బ్లాక్​ బాస్టర్​ టాక్​తో అదిరిపోయే వసూళ్లతో దూసుకెళ్తోంది. దీంతో ఈ సినిమా విజయోత్సవ వేడుకను చిత్ర బృందం హైదరాబాద్‌లో నిర్వహించింది. అయితే ఇప్పుడు మూవీటీమ్​.. థియేటర్లు వచ్చే ప్రేక్షకుల కోసం మరో సర్​ప్రైజ్​ ప్లాన్ చేసింది.

సినిమాలో ఓ పాటను అదనంగా యాడ్ చేయబోతున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని స్వయంగా బాలకృష్ణ చెప్పారు. సక్సెస్​ మీట్​లో మాట్లాడుతూ.. ఈ గుడ్​ న్యూస్​ తెలిపారు. ఓ సాంగ్​ను రెడీ చేశాం. ప్రేక్షకులను అట్రాక్ట్​ చేసేందుకు మాకు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సినిమా ఆల్రెడీ హిట్​ అయిపోయింది. ఆడియెన్స్​ ఇంకా ఎంజాయ్ చేయాలి. నాలుగున్నర నిమిషాల నిడివి ఉన్న పాటను 50-60 మంది డ్యాన్సర్లతో తీశాం. ఇప్పుడు దీన్ని యాడ్ చేయబోతున్నాం" అని పేర్కొన్నారు.

ఇంకా మాట్లాడుతూ.. భగవంత్ కేసరి లాంటి సందేశాత్మక చిత్రంలో నటించడం ఆనందంగా ఉందని బాలయ్య అన్నారు. దేశం మొత్తం ఈ సినిమా గురించి చర్చించుకుంటోందని చెప్పారు. అనిల్ రావిపూడి పాయింట్ చెప్పగానే తనకు ఎంతో నచ్చిందని, ఆ తర్వాత ఇద్దరూ కలిసి కొన్ని పాయింట్ల గురించి చర్చించుకుని ముందుకు వెళ్లినట్లు చెప్పుకొచ్చారు. వసూళ్లు సాధించేవే కమర్షియల్ సినిమాలు కాదని, మెసేజ్ ఇచ్చేవి కూడా కమర్షియల్ సినిమాలేనని పేర్కొన్నారు.

ఇక టాలీవుడ్​ చిత్ర పరిశ్రమకు దొరికిన ఆణిముత్యం శ్రీలీల అని ప్రశంసించారు బాలయ్య. తనకు దొరికిన అద్భుతమైన పాత్రలో చాలా అద్భుతంగా నటించిందని కొనియాడారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే మనస్తత్వం దర్శకుడు అనిల్ రావిపూడిదని అన్నారు. అందరి నుంచి చక్కని నటనను ఆయన రాబట్టారని చెప్పారు. ప్రతి మహిళకు ఓ సైనికుడిని ఇవ్వలేమని, మహిళలు ఎవరికి వారే ఓ సైనికుడిలా తయారవ్వాలని ఆకాంక్షించారు. ఇకపోతే ఈ సక్సెస్​ మీట్​లో నిర్మాత దిల్‌ రాజు, దర్శకురాలు నందిని రెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై సందడి చేశారు.