Begin typing your search above and press return to search.

భగవంత్ కేసరి, సైంధవ్… స్పీడ్ అప్

సీనియర్ హీరోలైన బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్ యంగ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ భగవంత కేసరి మూవీ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   5 Oct 2023 4:28 AM GMT
భగవంత్ కేసరి, సైంధవ్… స్పీడ్ అప్
X

సీనియర్ హీరోలైన బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్ యంగ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ భగవంత కేసరి మూవీ చేస్తున్నారు. ఈ సినిమా దసరాకి రిలీజ్ కాబోతోంది. యాక్షన్, కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఎక్స్ పెక్టేషన్స్ హై అండ్ లోనే ఈ చిత్రంపైన ఉన్నాయి.

ఈ మూవీ ట్రైలర్ ని అనిల్ రావిపూడి సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ డేట్ కూడా కన్ఫర్మ్ చేశారు. ట్రైలర్ తోనే ఈ సినిమాపై హైప్ క్రియేట్ చేయాలని భావిస్తున్నారు. మరో వైపు విక్టరీ వెంకటేష్ శైలేష్ కొలను దర్శకత్వంలో సైంధవ్ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. డిసెంబర్ లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.

డిసెంబర్ 21 అనుకున్న అది వాయిదా పడే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. మరో వైపు సైంధవ్ చిత్రం నుంచి టీజర్ రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారంట. వెంకటేష్ కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో బ్లాక్ బస్టర్ హిట్ ని ఖాతాలో వేసుకోవాలని వెంకటేష్ కూడా ఆలోచిస్తున్నారు.

తన ఇమేజ్ కి సరిపోయే కథ కావడంతో పాటు సీరియస్ క్యారెక్టరైజేషన్ లో నారప్ప తర్వాత చేస్తోన్న మూవీ కావడంతో ఎక్స్ పెక్టేషన్స్ గట్టిగానే ఉన్నాయి. హిట్ సిరీస్ తో రెండు సూపర్ హిట్స్ సొంతం చేసుకున్న శైలేష్ కొలను ఈ చిత్రంతో హ్యాట్రిక్ ని తన ఖాతాలో వేసుకోవాలని అనుకుంటున్నారు.

ఇద్దరు సీనియర్ హీరోలు కూడా తమ సినిమాల నుంచి బెస్ట్ అవుట్ పుట్ ఇవ్వడం కోసం గట్టిగానే కష్టపడుతున్నారు. అలాగే అనిల్ రావిపూడి, శైలేష్ కొలను కూడా సీనియర్ హీరోలని డీల్ చేసి స్టార్ డైరెక్టర్స్ గా మరింత గ్రాండియర్ గా ఎస్టాబ్లిష్ అయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నారు. భగవంత్ కేసరి ట్రైలర్, సైంధవ్ టీజర్ తో అభిమానులకి బెస్ట్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడానికి దర్శకులు ఇద్దరు గట్టిగానే వర్క్ చేస్తున్నారు.