Begin typing your search above and press return to search.

దంచవే మేనత్త కూతురా.. యమ స్టైలిష్

తాజాగా ఈ సాంగ్​కు సంబంధించి విడుదలైన స్టిల్​ అయితే నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది.

By:  Tupaki Desk   |   27 Oct 2023 12:43 PM GMT
దంచవే మేనత్త కూతురా.. యమ స్టైలిష్
X

దసరా విన్నర్​గా బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న 'భగవంత్ కేసరి' విడుదలై వారం రోజులు అయినా మంచి వసూళ్లను అందుకుంటూ దూసుకెళ్తోంది. రీసెంట్​గా ఈ చిత్రంలో బాలయ్య గత చిత్రంలోని 'దంచవే మేనత్తా కూతురా' రీమిక్స్​ సాంగ్​ కూడా యాడ్​ చేయగా.. దీనికి మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ సాంగ్​లోని ఓ స్టిల్​ బయటకు వచ్చి ఫుల్ ట్రెండ్ అవుతూ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

వివరాళ్లోకి వెళితే.. అసలీ ఈ కమర్షియల్​ మాస్​ సాంగ్​కు మొదటి నుంచి మంచి క్రేజ్ ఉన్నప్పటికీ, సినిమా ఫైనల్ కట్ చూసిన తర్వాత, కథకు అడ్డంగా ఉందని పాటను తీసేశారు. ఈ విషయాన్ని విడుదలకు ముందే ప్రేక్షకులకు తెలియజేశారు. అనంతరం పండగ రోజు నుంచి ఆ సాంగ్​ను యాడ్ చేశారు. దీంతో మరోసారి నందమూరి అభిమానులు సినిమాను చూసేందుకు తరలివస్తున్నారు.

సోషల్​ మీడియా అంతా ఈ పాటే ఎక్కువగా ట్రెండ్ అవుతోంది. రాహుల్ సిప్లిగంజ్​ ఆలపించిన విధానం, మ్యూజిక్​, సాంగ్​లో బాలయ్య-కాజల్​ అగర్వాల్​-శ్రీలీల కలిసి చిందులేయడం సినీ ప్రియుల్లో మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ ముగ్గురు కలిసి చిందులేస్తుంటే అభిమానులు థియేటర్లలో గోల గోల చేస్తూ రచ్చ చేస్తున్నారు.

తాజాగా ఈ సాంగ్​కు సంబంధించి విడుదలైన స్టిల్​ అయితే నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. అందులో బాలయ్య అయితే కాజల్ - శ్రీలీల మధ్య నిలబడి రెడ్ కలర్ సూట్​లో, సాల్ట్ అండ్ పెప్పర్​ లుక్​లో మంచి స్మైలింగ్​ లుక్​లో స్టెప్పులేస్తూ అదరగొట్టేశారు. ఇక కాజల్ అదిరిపోయే శారీ లుక్​లో శ్రీలీల లంగాఓణిలో సూపర్​గా కనిపించారు. ఇక చుట్టూ ఆడవాళ్లు. బ్యాక్​గ్రౌండ్​ మొత్తం కలర్​ఫుల్​గా మెస్మరైజ్ చేసింది.

ఇకపోతే ఈ వారం చెప్పుకోదగ్గ రిలీజులు ఏమీ లేవు. కేవలం మార్టిన్ లూథర్ కింగ్ మాత్రమే వచ్చింది. కాబట్టి భగవంత్ కేసరి ఈ వీకెండ్​ను కూడా కంట్రోల్​లోకి వెళ్లిపోతుంది. శ్రీలీల విజ్జీ పాప పాత్ర సెంటిమెంట్, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంశాలు కుటుంబ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి.