Begin typing your search above and press return to search.

శ్రీదేవి..జ‌య‌సుధ‌..జ‌య‌ప్ర‌ద‌ల్ని గుర్తు చేసిన శ్రీలీల‌!

హీరోయిన్ గానే కాదు శ్రీలీల ఎలాంటి పాత్ర అయిన అవ‌లీల‌గా పోషించ‌గ‌ల‌ద‌ని ఈ సినిమాతో మ‌రోసారి రుజువు చేసింది. ఆమె కెరీర్ లోనే గుర్తిండిపోయే రోల్ ఇది

By:  Tupaki Desk   |   25 Oct 2023 5:03 AM GMT
శ్రీదేవి..జ‌య‌సుధ‌..జ‌య‌ప్ర‌ద‌ల్ని గుర్తు చేసిన శ్రీలీల‌!
X

'భ‌గ‌వంత్ కేస‌రి'తో న‌ట‌సింహ బాల‌కృష్ణ ఖాతాలో మ‌రో భారీ స‌క్సెస్ జ‌మ అయిన సంగ‌తి తెలిసిందే. బాల‌య్య స‌హా టీమ్ అంతా ఎంతో సంతోషంలో క‌నిపిస్తుంది. ఇక ఇందులో బాల‌య్య కుమార్తె పాత్ర పోషంచిన శ్రీలీల న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల్ని క‌ట్టి ప‌డేసింది. సినిమాకి ఆ పాత్ర ఎంత బల‌మైన‌దో తెలిసిందే. ఆపాత్ర‌కు మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు ద‌క్కాయి. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి.

హీరోయిన్ గానే కాదు శ్రీలీల ఎలాంటి పాత్ర అయిన అవ‌లీల‌గా పోషించ‌గ‌ల‌ద‌ని ఈ సినిమాతో మ‌రోసారి రుజువు చేసింది. ఆమె కెరీర్ లోనే గుర్తిండిపోయే రోల్ ఇది. తాజాగా ఆమె న‌ట‌న‌ని ఉద్దేశించి నిర్మాత దిల్ రాజ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. ఈ సినిమా విడుదల ముందు వరకు కూడా శ్రీలీల అంటే మంచి డ్యాన్సర్ అని అనే వారు. నేను అలాగే అనుకునేవాడిని. కానీ ఈ చిత్రంలో ఆమె నటన శ్రీదేవి.. జయసుధ.. జయప్రదలను గుర్తు చేసింది.

నటిగా శ్రీలీలకు మంచి భవిష్యత్తు ఉంది. ఆమె గొప్ప స్థాయికి చేరుకుం టుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు' అని అన్నారు. మొత్తానికి శ్రీలీల‌పై రాజుగారి అభిమాన‌మంతా మాట‌ల్లో క‌నిపించింది. గొప్ప న‌టీమ‌ణుల‌తో పోల్చ‌డం అంటే ఎద్ద సాహ‌స‌మ‌నే చెప్పాలి. శ్రీదేవి...జ‌య‌సుధ‌..జ‌య‌ప్ర‌ద‌లు న‌ట‌నా రంగంలో ఓ లెజెండ్స్. అలాంటి లెజెండ్స్ తో పొల్చాలాంటే కొన్ని అర్హ‌త‌లుండాలి. అందుకు రాజుగారు అన్ని విధాలుగా తగిన వారే.

ఆయ‌న ద‌ర్శ‌కుడు కాక‌పోయినా గ్రేట్ ప్రోడ్యూస‌ర్. క‌థ‌ల్ని గొప్ప‌గా జ‌డ్జ్ చేయ‌గ‌ల‌రు. ఏది క‌మ‌ర్శియ‌ల్ హిట్ అవుతుంది. ఎలాంటి క‌థ ఎలా రాణిస్తుంది ? అన్న మార్కెట్ అంచ‌నాలు ఆయ‌న‌కు బాగా తెలుసు. అలాగే ఏ పాత్ర‌కి ఏ హీరో..హీరోయిన్ అయితే బాగుంటుందో? చెప్ప‌గ‌ల స‌మ‌ర్దుడు. పేరుకే నిర్మాత కానీ..ద‌ర్శ‌కుడికి కావాల్సిన అన్ని అర్హ‌త‌లు ఆయ‌న‌లో ఉన్నాయి. అలాంటి నిర్మాత నోట‌ల‌నే శ్రీలీల గ్రేట్ పెర్పార్మ‌ర్ అని మెచ్చుకోవ‌డం అంటే చిన్న విషయం కాదు.