Begin typing your search above and press return to search.

బాలయ్య- శ్రీలీల జోరు..ఇది అన్​స్టాపబుల్​

ఈ 'ఎపిసోడ్' శానా దినాలు యాదుంటాది! అంటూ రాసుకొచ్చారు. వీరిందరినీ ఈ వీడియోలో గ్రాండ్​గా ఇంట్రడ్యూస్​ చేశారు

By:  Tupaki Desk   |   13 Oct 2023 11:16 AM GMT
బాలయ్య- శ్రీలీల జోరు..ఇది అన్​స్టాపబుల్​
X

మాస్ కా బాప్, స్టార్ హీరో, నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్​గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షో ఎలాంటి విశేష ఆదరణ పొందిందో తెలిసిన విషయమే. సక్సెస్​ఫుల్​గా రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం మరో ఐదు రోజుల్లో మూడో సీజన్​ను ప్రారంభించుకోనుంది. ఈ నెల 17 నుంచి ఆహాలో షురూ కానుంది.

పవర్ ప్యాక్డ్​ లిమిటెడ్ ఎడిషన్​తో రానున్న ఈ మూడో సీజన్ మొదటి ఎపిసోడ్​లో భగవంత్ కేసరి టీమ్ సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఆహా మేకర్స్ రోజుకో అప్డేట్స్​ను వదులుతూ ఆడియెన్స్​లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు. ఈ ఎపిసోడ్​లో అనిల్ రావిపూడి, చందమామ కాజల్, యంగ్ సెన్సేషనల్​ బ్యూటీ శ్రీలీల, బాలీవుడ్ స్టార్ యాక్టర్​ అర్జున్ రాంపాల్​ సందడి చేయనున్నారు. తాజాగా మేకర్స్​ ఓ వీడియో గ్లింప్స్​ను రిలీజ్ చేశారు.

ఈ 'ఎపిసోడ్' శానా దినాలు యాదుంటాది! అంటూ రాసుకొచ్చారు. వీరిందరినీ ఈ వీడియోలో గ్రాండ్​గా ఇంట్రడ్యూస్​ చేశారు. ఈ సారి సీజన్​లో బాలయ్య రెట్టించిన ఉత్సాహంతో కనిపించనున్నట్లు చూపించారు. 37సెకన్ల ఉన్న ఈ వీడియో గ్లింప్స్​ తెగ ఆకట్టుకుంది. అక్టోబర్ 17న ఈ షో ప్రీమియర్స్ పడనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.

అలాగే బాలా అండ్ శ్రీలీల చేసిన హాడావుడి వచ్చేస్తుందంటూ శ్రీలీలకు సంబంధించిన మరో వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఇందులో శ్రీలీల మేకప్​ వేసుకుని ఫుల్ గ్లామర్​గా నవ్వుతూ ఎంతో క్యూట్​గా కనిపించింది. కాగా, మాస్ యాక్షన్ ఎంటర్​టైనర్​గా తెరకెక్కిన భగవంత్ కేసరి సినిమా ఈ నెల 19న గ్రాండ్​గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇందులో భాగంగానే మూవీటీమ్ జోరుగా ప్రమోషన్స్ చేస్తోంది. ఈ క్రమంలోనే అన్‏స్టాపబుల్ మొదటి ఎపిసోడ్​కు గెస్ట్​గా భగవంత్​ టీమ్ వచ్చి సందడి చేసింది. బాలయ్యతో కలిసి సరదా సరదాగా సందడి చేసింది. అలాగే ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.