Begin typing your search above and press return to search.

గణేష్ సాంగ్.. దద్దరిల్లేలా బాలయ్య, శ్రీలీల సౌండ్

ఇక మొత్తానికి గణేష్ యన్తేమ్ లిరికల్ పాటను విడుదల చేశారు. గణేష్ పండగ హడావిడిలో ఈ పాట బాగా వైరల్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా అనిపిస్తుంది

By:  Tupaki Desk   |   6 Sep 2023 8:55 AM GMT
గణేష్ సాంగ్.. దద్దరిల్లేలా బాలయ్య, శ్రీలీల సౌండ్
X

అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ మొదటిసారి చేస్తున్న సినిమా భగవంత్ కేసరి ఇక ఈ సినిమాను అక్టోబర్ 19వ తేదీన గ్రాండ్గా విడుదల చేయాలని అనుకుంటున్న విషయం తెలిసిందే. సినిమాలో శ్రీ లీల ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతోంది. ఇక సీనియర్ నటి కాజల్ అగర్వాల్ బాలయ్య బాబుకు జోడిగా నటిస్తోంది. మొత్తానికి ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతూ ఉండడంతో ప్రమోషన్స్ హడావిడి కూడా మొదలుపెట్టేశారు.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ కూడా సినిమాపై అంచనాల స్థాయిని పెంచేసిందే. ఇక ఇప్పుడు వరుసగా సాంగ్స్ ను విడుదల చేస్తూ సినిమాపై అంచనాల స్థాయిని మరింత పెంచుతున్నారు. గత గత కొన్ని రోజులుగా ఈ సినిమాలోని గణేష్ పాట గురించి చిత్ర యూనిట్ ఏ స్థాయిలో హడావిడి చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దానికి సంబంధించిన ప్రోమోలు అప్డేట్స్ ఇస్తూ తప్పకుండా ఈ సాంగ్ అయితే అందరిని ఆకట్టుకుంటుంది అని సోషల్ మీడియాలో చెబుతూ వస్తున్నారు.

ఇక మొత్తానికి గణేష్ యన్తేమ్ లిరికల్ పాటను విడుదల చేశారు. గణేష్ పండగ హడావిడిలో ఈ పాట బాగా వైరల్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఇక ఈ పాటలో మాస్ లిరిక్స్ తో పాటు సంస్కృతంలో విగ్నేశ్వరుడిని పొగుడుతున్న లైన్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. తమన్ ఇచ్చిన ట్యూన్స్ మోత మోగించేలా కనిపిస్తోంది.

ఇక పాటకు దీటుగా నందమూరి బాలకృష్ణ శ్రీ లీలా ఇద్దరు కూడా వారి స్టెప్పులతో మరింత జోష్ నింపారు అని చెప్పాలి. భగవంత్ కేసరిలో ఈ పాట చాలా స్పెషల్ అట్రాక్షన్ గాని నిలువబోతున్నట్లుగా తెలుస్తోంది. సినిమాలో బాలకృష్ణ భగవత్ కేసరిగా నెవ్వర్ బిఫోర్ అనేలా కనిపించబోతున్నాడు. ఆయన మొత్తం గా మొదటిసారి తెలంగాణ భాషలో ఆకట్టుకుపోతున్నట్లు ఇదివరకే క్లారిటీ ఇచ్చారు.

ఇక బాలయ్య బాబు తెలంగాణ డైలాగ్స్ తో ఎలా ఆకట్టుకుంటాడు అనేది అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తోంది. ఇక ఈ సినిమాలో శ్రీలీల పాత్ర కూడా చాలా అల్లరిగా అలాగే ఎమోషనల్ గా కూడా కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుందట. కాజల్ అగర్వాల్ బాలయ్య బాబు మధ్యలో వచ్చే సీన్స్ కూడా స్పెషల్ గా ఉండబోతున్నట్లు దర్శకుడు తెలియజేశాడు. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.