Begin typing your search above and press return to search.

భగవంత్ కేసరిలో అసలైన ట్విస్ట్.. బ్లాస్ట్ అయ్యేలా..?

నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ భగవంత్ కేసరి

By:  Tupaki Desk   |   16 Aug 2023 4:42 AM GMT
భగవంత్ కేసరిలో అసలైన ట్విస్ట్.. బ్లాస్ట్ అయ్యేలా..?
X

నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ భగవంత్ కేసరి. భారీ బడ్జెట్ తో షైన్ స్క్రీన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దసరాగా రిలీజ్ కానున్న ఈ మూవీ మెజారిటీ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయిపొయింది. ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ కూడా ఫ్యాన్స్ ని అలరించింది. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ కథలో పవర్ ఫుల్ పాత్రలో బాలయ్య కనిపించబోతున్నారు.

మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా, శ్రీలీల బాలయ్య కూతురి పాత్రలో కనిపించబోతోంది. ఆమె పాత్ర ఎలా ఉంటుందనేది ఇప్పటి వరకు దర్శకుడు క్లారిటీ ఇవ్వలేదు. మూవీలో పవర్ ఫుల్ డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్ తో పాటు అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుందనే మాట వినిపిస్తోంది. బాలయ్య చేసే ఫన్ ని మూవీలో ప్రతి ఒక్కరు ఆశ్వాదిస్తారంట.

భగవంత్ కేసరిలో అర్జున్ రాంపాల్ ప్రతినాయకుడిగా టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు సినిమాకి సంబందించిన ఇంటరెస్టింగ్ టాక్ ఒకటి తెరపైకి వచ్చింది. మూవీలో పవర్ ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఒకటి ఉంటుందంట. అందులో బాలయ్య పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తాడంట. అలాగే ఆ పాత్రకి కాస్తా యాక్షన్ టచ్ తో పాటు హార్ట్ టచింగ్ ఎమోషనల్ బ్లాక్స్ కూడా ఉంటాయని టాక్ వినిపిస్తోంది.

ఆ ఎపిసోడ్ సినిమాలో చాలా కీలకంగా ఉంటుందని, పోలీస్ ఆఫీసర్ గా ఉండే బాలయ్య తరువాత తన ఐడెంటిటీ మార్చుకోవడానికి కారణం ఏంటి అనేది మూవీలో మెయిన్ హైలైట్ సీన్ అని చెప్పుకుంటున్నారు. అలాగే కూతురు శ్రీలీల కోసం బాలయ్య చేసిన సాహసాలు కూడా మూవీలో చూడొచ్చంట.

ఏది ఏమైనా అఖండ, వీరసింహారెడ్డి లాంటి వరుస హిట్స్ తో ఉన్న బాలయ్యకి అనిల్ రావిపూడి కూడా భగవంత్ కేసరితో మరో బ్లాక్ బస్టర్ ని ఇచ్చేలా ఉన్నాడని చెప్పొచ్చు. అతని ట్రాక్ రికార్డ్ ప్రకారం చూసుకున్న వరుసగా ఐదు హిట్స్ ఉన్నాయి. దీంతో డబుల్ హ్యాట్రిక్ అందుకునే ఛాన్స్ కనిపిస్తోంది. ఇప్పటి వరకు కెరియర్ ఆరంభం నుంచి అపజయం ఎరుగని దర్శకుల జాబితాలో రాజమౌళి తర్వాత అనిల్ రావిపూడి ఉన్నారు.