Begin typing your search above and press return to search.

భగవంత్ కేసరి.. మొదటి రోజు ఎంత వచ్చాయంటే..

నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమా గురువారం రోజు గ్రాండ్ గా విడుదలైన విషయం తెలిసిందే

By:  Tupaki Desk   |   20 Oct 2023 9:56 AM GMT
భగవంత్ కేసరి.. మొదటి రోజు ఎంత వచ్చాయంటే..
X

నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమా గురువారం రోజు గ్రాండ్ గా విడుదలైన విషయం తెలిసిందే. సినిమా విడుదలకు ముందే అప్డేట్స్ తో మంచి హైప్ అయితే క్రియేట్ చేసింది. దర్శకుడు అనిల్ రావిపూడి బాలయ్యను సరికొత్తగా ప్రజెంట్ చేయడమే కాకుండా సినిమాలో ఒక సెన్సిటివ్ పాయింట్ హైలెట్ చేయడంతో ఓ వర్గం ప్రేక్షకులను ఈ సినిమా బాగానే ఆకట్టుకుంది.

అంతే కాకుండా సినిమాలో బాలయ్య బాబు యాక్షన్ ఎలివేషన్స్ తో పాటు పవర్ఫుల్ డైలాగ్స్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఇక రివ్యూలు కూడా పాజిటివ్ గానే రావడంతో ఈ సినిమా మొదటి రోజు మాస్ సెంటర్లలో మంచి కలెక్షన్స్ రాబట్టింది. బాలయ్య బాబు అఖండ సినిమా తర్వాత మంచి ఫామ్ లో కొనసాగుతూ ఉండడంతో ఈ సినిమాకు కూడా ఆ ఎనర్జీ బాగా కలిసి వచ్చింది.

ఇక భగవంత్ కేసరి సినిమా మొదటిరోజు రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా వచ్చిన షేర్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. నైజంలో 4.1 కోట్లు, సీడెడ్ లో 2.6 కోట్లు, ఉత్తరాంధ్రలో 1.24 కోట్లు గుంటూరు లో 3.08 కోట్లు, నెల్లూరులో 65 లక్షల షేర్ వరకు రాబట్టినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఆంద్రప్రదేశ్ తెలంగాణలో వచ్చిన షేర్ 14.23 కోట్లు.

ఇక కర్ణాటక అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా చూసుకుంటే అటువైపు నుంచి ఈ సినిమా ఒక కోటి షేర్ రాబట్టినట్లు టాక్. ఫైనల్ గా భగవంత్ కేసరి ప్రపంచవ్యాప్తంగా అందుకున్న 18 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్లు అందుకున్నట్లు టాక్. అంటే ఈ సినిమాకు 30 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక భగవంత్ కేసరి ఫ్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు 65 కోట్ల రేంజ్ లో చేసినట్లు సమాచారం.

మొదటిరోజు ఈ సినిమాకు 25% పైగా షేర్ కలెక్షన్స్ వచ్చాయి. అంటే బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ కావాలి అంటే ఇంకా 45 కోట్ల రేంజ్ లోనే షేక్ కలెక్షన్స్ అందుకోవాలి. లియోకు కొంత నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా ఆ సినిమా బాక్స్ ఆఫీస్ మీద కొంత పోటీని ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఇక భగవంత్ ఈ వీకెండ్ టార్గెట్ ను పూర్తి చేసుకోగలిగితే నార్మల్ డేస్ లో వచ్చేవన్నీ కూడా లాభాలే. మరి ఆ రేంజ్ లో సినిమా ప్రభావం చూపుతోందో లేదో చూడాలి.