Begin typing your search above and press return to search.

భగవంథ్ కేసరి సెన్సార్ టాక్.. ఇది మ్యాటర్!

ఇక సెన్సార్ యూనిట్ నుంచి ఈ సినిమాకు పాజిటివ్ రియాక్షన్స్ లభించాయట.

By:  Tupaki Desk   |   13 Oct 2023 3:00 PM GMT
భగవంథ్ కేసరి సెన్సార్ టాక్.. ఇది మ్యాటర్!
X

నందమూరి బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేసిన భగవంథ్ కేసరి సినిమా ఈ నెల 19వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ట్రైలర్ అభిమానుల్లోనే కాకుండా సాధారణ ప్రేక్షకులను కూడా బాగానే అట్రాక్ట్ చేసింది. సినిమాలో మంచి ఎమోషన్ తో పాటు అనిల్ రావిపూడి ఎంటర్టైన్మెంట్ కూడా గట్టిగానే ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ట్రైలర్ అయితే సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక థియేటర్లో కంటెంట్ మరింత క్లిక్ అయితే బాక్స్ ఆఫీస్ వద్ద బాలయ్య జోరు గట్టిగానే కనిపిస్తుంది. పోటీగా మరో రెండు సినిమాలు ఉన్నప్పటికీ ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ అయితే అందుకునే అవకాశం ఉంది. భగవంథ్ కేసరి సెన్సార్ పనులు కూడా ఈరోజు ముగిసాయి. ఇక సెన్సార్ యూనిట్ నుంచి ఈ సినిమాకు పాజిటివ్ రియాక్షన్స్ లభించాయట.

ఈ సినిమాలో పెద్దగా అభ్యంతరకర సన్నివేశాలు లేవు. ఇక బాలయ్య మార్క్ హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ ఉన్నాయి. దీంతో సెన్సార్ నుంచి ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ లభించింది. 2 గంటల 35 నిమిషాల రన్ టైమ్ తో వెండితెరపైకి రాబోతున్న భగవంథ్ కేసరి ఫస్ట్ హాఫ్ శ్రీలీల తో ఫన్ ఎమోషన్ హైలెట్ గా నిలుస్తుందట.

ఇక సెకండ్ హాఫ్ లో బాలయ్య నెవర్ బిఫోర్ లుక్ కూడా ఆకట్టుకుంటుందని తెలుస్తోంది. ఈ సినిమాలో థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా మరో లెవెల్ లో క్లిక్ అయింది అనేలా కామెంట్స్ వస్తున్నాయి. చిత్ర యూనిట్ అయితే సినిమా రిజల్ట్ పై ధీమాగానే ఉంది. ఇక ఇప్పుడు సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈనెల 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది.

సినిమాలో కాజల్ అగర్వాల్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆమెతో బాలయ్య బాబు దంచవే మేనత్త కూతురా రీమిక్స్ పాటకు స్టెప్పులు కూడా వేశారు. అయితే ఆ పాటను మాత్రం సినిమా విడుదలైన తర్వాత దసరా సందర్భంగా సినిమాలో జత చేయబోతున్నట్లు దర్శకుడు అనిల్ రావిపూడి తెలియజేశారు. మరి ఆ పాట సినిమా కలెక్షన్స్ పై ఎంతగా ప్రభావం చూపుతుందో చూడాలి.