సూరి స్థానంలోకి గురూజీ దిగుతున్నాడా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటికే `హరిహరవీరమల్లు` పెండింగ్ షూటింగ్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 9 May 2025 11:30 PMపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటికే `హరిహరవీరమల్లు` పెండింగ్ షూటింగ్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. దీంతో యూనిట్ సీజీ పనుల్లో పడ్డారు. అలాగే మంచి రిలీజ్ తేదీ కోసం సెర్చ్ చేస్తున్నారు. జూన్ లో రిలీజ్ ఉండే అవకాశం ఉంది. అలాగే పవన్ `ఓజీ` షూటింగ్ కి సంబంధించి డేట్లు కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. ఎప్పటి నుంచి జాయిన్ అవుతాడు? అన్నది తెలియదు గానీ ఇక ఓజీ టీమ్ని వెయింట్ చేయించడని తెలుస్తోంది.
అలాగే హరీష్ శంకర్ తో పట్టాలెక్కించాల్సిన `ఉస్తాద్ భగత్ సింగ్` కూడా ముహూర్తం పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. `ఓజీ` తో పాటు ఆ చిత్రాన్ని కూడా రీస్టార్ట్ చేసే అవకాశం ఉంది. మరి సురేందర్ రెడ్డికి ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటి? అంటే ఆ ప్రాజెక్ట్ రద్దు అయిందని సమాచారం. సూరితో ఎలాంటి సినిమా లేకుండా ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో సూరి స్థానంలో ఇప్పుడు త్రివిక్రమ్ రంగంలోకి దిగుతున్నట్లు ఫిలిం సర్కిల్స్ లో వాడి వేడి డిస్కషన్ మొదలైంది.
ఇద్దరి కాంబినేషన్ లో త్వరలో ఓ సినిమా ఉంటుందంటున్నారు. ఈసారి ఆ చిత్రం ఎంతో ప్రతిష్టాత్మ కంగానూ ఉంటుందని వినిపిస్తుంది. స్నేహితుడు త్రివిక్రమ్ అడిగితే పీకే ఎందుకు కాదంటాడు. కాకపోతే అందుకు కాస్త సమయం పడుతుంది. ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేయాలి. అలాగే త్రివిక్రమ్ కూడా విక్టరీ వెంకటేష్ హీరోగా ఓ చిత్రాన్ని తెరకెక్కించాలనుకుంటున్నారు.
ప్రస్తుతం ఆ సినిమా పనుల్లోనే బిజీగా ఉన్నారు. వాస్తవానికి బన్నీతో చిత్రాన్ని పట్టాలెక్కించాలి. కానీ మధ్య లోకి అట్లీ రావడంతో గురూజీ వెనక్కి వెళ్లారు. ఈ నేపథ్యంలో మళ్లీ ప్రాణ స్నేహితుడు పవన్ కోసం కథ రాసే పని తగిలింది. ఇద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే జులాయి, అత్తారింటికి దారేది లాంటి హిట్ చిత్రాలు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.