Begin typing your search above and press return to search.

భగవంత్ కేసరి బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్.. తేజశ్విని స్పెషల్ ఎట్రాక్షన్..!

బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ గురువారం హైదరాబాద్ లో జరిగాయి.

By:  Tupaki Desk   |   10 Nov 2023 5:59 AM GMT
భగవంత్ కేసరి బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్.. తేజశ్విని స్పెషల్ ఎట్రాక్షన్..!
X

బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ గురువారం హైదరాబాద్ లో జరిగాయి. నందమూరి ఫ్యాన్స్, సినీ అతిథుల మధ్య ఈ వేడుక జరిగింది. అనిల్ రావిపుడి దర్శకత్వంలో తెరకెక్కిన భగవంత్ కేసరి సినిమాలో కాజల్, శ్రీ లీల ఫిమేల్ లీడ్స్ గా నటించారు. బాలకృష్ణ సినిమాలకు భిన్నంగా భగవంత్ కేసరి వచ్చింది. ఒకప్పుడు బాలకృష్ణకు ఫ్యామిలీ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది కానీ ఆయన మాస్ పంథా లో సినిమాలు చేయడంతో ఆ కేటగిరి ఆడియన్స్ చూడటం మానేశారు.

బాలకృష్ణ సినిమా అంటే వైలెన్స్ ఎక్కువగా ఉంటుందన్న ఉద్దేశ్యంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఆసక్తి చూపించలేదు. కానీ భగవంత్ కేసరి సినిమా చూశాక బాలయ్య ఎలాంటి సినిమా అయినా చేయగలడని నిరూపించాడు. ఇదే కాదు బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో కూడా ప్రేక్షకులకు బాగా రీచ్ అయ్యింది. బాలకృష్ణ డిజిటల్ ఎంట్రీ, షో హోస్ట్ దీని వెనుక ఆయనకు సపోర్ట్ గా నిలిచారు బాలకృష్ణ చిన్న కూతురు తేజశ్విని.

అన్ స్టాపబుల్ షోలో బాలకృష్ణ లుక్ ఆ ప్రోగ్రాం డిజైన్ అంతా కూడా తేజశ్విని దగ్గర ఉండి చూసుకున్నారు. ఇక భగవంత్ కేసరి సినిమాకు కూడా ఆమె తెర వెనుక సపోర్ట్ అందించారని తెలుస్తుంది. అందుకే భగవంత్ కేసరి బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ లో తేజశ్విని కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. సినిమా క్రూలో ఆమె కూడా ఒక భాగమని తెలుస్తుంది.

ఇదివరకు బాలయ్య సినిమా వేడుకలకు పెద్దగా ఆసక్తి చూపించని తేజశ్విని ఇప్పుడు బాలకృష్ణ సినిమాలకు పనిచేయడం ఆయన పర్సనల్ విషయాల గురించి సరి చూడటం లాంటివి చేస్తూ ఆయన్ను అసిస్ట్ చేస్తున్నారు. అందుకే ఈమధ్య బాలకృష్ణ ఎనర్జీ డబుల్ అయ్యింది. అన్ స్టాపబుల్ షో చేసినప్పటి నుంచి బాలయ్య ని కూడా ఎవరు ఆపేలా లేరని చెప్పొచ్చు. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి మూడు సినిమాల హిట్ తో హ్యాట్రిక్ అందుకున్న బాలయ్య బాబు తన నెక్స్ట్ సినిమా బాబీ తో చేస్తున్నాడు. ఆ సినిమా కూడా నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ తో వస్తుందని తెలుస్తుంది. సితార బ్యానర్ నుంచి వస్తున్న సినిమా కాబట్టి ఆ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. బాలయ్య హ్యాట్రిక్ కాదు డబుల్ హ్యాట్రిక్ కూడా కొట్టేలా ఉన్నాడని చెప్పొచ్చు.