Begin typing your search above and press return to search.

సత్యదేవ్ 'కృష్ణమ్మ' బాక్సాఫీస్.. కెరీర్ లో బెస్ట్ ఫిల్మ్ గా!

అయితే సత్యదేవ్ హీరోగా వీవీ గోపాలకృష్ణ తెరకెక్కించిన రీసెంట్ మూవీ 'కృష్ణమ్మ' నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

By:  Tupaki Desk   |   11 May 2024 12:51 PM GMT
సత్యదేవ్ కృష్ణమ్మ బాక్సాఫీస్.. కెరీర్ లో బెస్ట్ ఫిల్మ్ గా!
X

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో సత్యదేవ్ కు మంచి ఫ్యాన్ బేస్ ఉందన్న విషయం తెలిసిందే. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ చేసి.. ఆ తర్వాత హీరోగా మారి డిఫరెంట్ కాన్సెప్టులతో సినిమాలు చేస్తూ ఆయన ఆకట్టుకుంటున్నారు. తన యాక్టింగ్ తో ప్రశంసలు అందుకుంటున్నారు. అయితే సత్యదేవ్ హీరోగా వీవీ గోపాలకృష్ణ తెరకెక్కించిన రీసెంట్ మూవీ 'కృష్ణమ్మ' నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.


సత్యదేవ్‌ లోని నటుడిని కొత్తగా ఆవిష్కరించిన సినిమాగా 'కృష్ణమ్మ' అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఎమోషనల్ అండ్ మాస్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీలో సత్యదేవ్ రగ్డ్ లుక్, రస్టిక్ యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. స్నేహం, ప్రేమ వంటి అంశాలతో యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాలు ఆడియన్స్ కు కొత్త అనుభూతి ఇస్తున్నాయి. ఇటు ప్రేక్షకుల నుంచి.. అటు విమర్శకుల నుంచి మంచి రివ్యూలు వస్తున్నాయి.

అయితే 'కృష్ణమ్మ' సినిమా సత్యదేవ్ కెరీర్ లో అరుదైన రికార్డు క్రియేట్ చేసింది. తొలి రోజు కోటి రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. సత్యదేవ్ కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా నిలిచింది. ఓవైపు ఎన్నికలు, మరోవైపు ఐపీఎల్ క్రికెట్ ఫీవర్ ఉన్నా.. 'కృష్ణమ్మ' సాలిడ్ ఓపెనింగ్స్ సాధించడం రాబట్టడం మంచి పరిణామమని సినీ పండితులు చెబుతున్నారు. మే నెలాఖరు వరకు పెద్దగా సినిమాల రిలీజులు లేకపోవడం వల్ల 'కృష్ణమ్మ' బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.

ఈ సినిమాలో సత్యదేవ్ తో పాటు లక్ష్మణ్ మీసాల, రఘు కుంచె, అథీరా రాజ్ కీలక పాత్రల్లో నటించారు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ కొమ్మలపాటి నిర్మించారు. కాలభైరవ సంగీతాన్ని అందించిన ఈ చిత్రానికి సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీ అందించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో.. ఈ మూవీ ఓటీటీ హక్కులను దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

కథేంటంటే?

భద్ర (సత్యదేవ్)తోపాటు మరో ఇద్దరు స్నేహితులు అనాధలుగా పెరుగుతారు. వీళ్ల ముగ్గురూ ఎప్పటికైనా ఒక ఫ్యామిలీలాగా ఉండాలని అనుకుంటారు. ఆ సమయంలో వీళ్ల లైఫ్ లో మీనా(అథీరా రాజ్) వస్తుంది. సత్యదేవ్ స్నేహితుడొకరు, మీనా ప్రేమలో పడతారు. ఆ తర్వాత భద్రకి రాఖీ కట్టి అన్నయ్యగా ట్రీట్ చేస్తుంటుంది. అదే టైంలో మీనాకు ఓ కష్టం వస్తుంది. కానీ అప్పుడే సత్యదేవ్ తో పాటు ఇద్దరు ఫ్రెండ్స్ అరెస్ట్ అవుతారు. మరి వారంతా చివరి వరకు ఫ్యామిలీగా బతికారా? ఎందుకు అరెస్ట్ అయ్యారు? లాస్ట్ కు ఏం జరిగిందనేది కృష్ణమ్మ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.