Begin typing your search above and press return to search.

ఆ దేశానికి బయలుదేరిన బన్నీ.. ఎందుకంటే..

వీలైనంతవరకు డిఫరెంట్ కథలను సెలెక్ట్ చేసుకుంటూ తన మార్కెట్ పరిధిని పెంచుకున్న అల్లు అర్జున్ పుష్ప సినిమాతో అంతకుమించి అనేలా సక్సెస్ అందుకున్నాడు

By:  Tupaki Desk   |   15 Feb 2024 7:54 AM GMT
ఆ దేశానికి బయలుదేరిన బన్నీ.. ఎందుకంటే..
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ కూడా ఇప్పుడు దేశాలు దాటుతోంది. బలమైన బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా తన టాలెంట్ తో హార్డ్ వర్క్ తోనే అల్లు అర్జున్ ఈ స్థాయికి వచ్చాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. వీలైనంతవరకు డిఫరెంట్ కథలను సెలెక్ట్ చేసుకుంటూ తన మార్కెట్ పరిధిని పెంచుకున్న అల్లు అర్జున్ పుష్ప సినిమాతో అంతకుమించి అనేలా సక్సెస్ అందుకున్నాడు.

కేవలం తెలుగులోనే కాకుండా ఈ సినిమాకు బాలీవుడ్ లో కూడా మంచి రెస్పాన్స్ దక్కింది. ఇక విదేశాల్లో కూడా పలు ఫిలిం ఫెస్టివల్స్ లలో పుష్ప ప్రస్తావన రావడం విశేషం. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ కు ఇండియా సినిమా గొప్పతనాన్ని చాటి చెప్పే మరో అవకాశం దక్కింది. జర్మనీలోనీ బెర్లిన్‌లో జరిగే ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్‌లో భారతీయ సినిమా గొప్పతనాన్ని సూచించడానికి అల్లు అర్జున్ బయలుదేరాడు. అందుకు సంబంధించిన విజువల్స్ కూడా ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అల్లు అర్జున్ ఈ ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొనడం చాలా మంచి విషయం అని చెప్పాలి. ముఖ్యంగా అందులోనూ టాలీవుడ్ నుంచి వెళుతున్న ఏకైక హీరో కావడం తెలుగు వారికి కూడా గర్వించదగిన విషయం అని చెప్పవచ్చు. అల్లు అర్జున్ స్థాయి ఏ లెవెల్లో పెరిగిపోతుందో మరోసారి అర్థమవుతోంది. ఇక పుష్ప సెకండ్ పార్ట్ కోసం మరింత ఎక్కువ స్థాయిలో కష్టపడుతున్న అల్లు అర్జున్ ఎలాగైనా సినిమాతో బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల మార్కెట్ కూడా రాబట్టాలి అని ఒక టార్గెట్ అయితే ఫిక్స్ చేసుకున్నారు.

ఇక సినిమా ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే సినిమా ఆ సమయానికి రాకపోవచ్చు అని కూడా చాలా రకాల వార్తలొచ్చాయి. కానీ అందులో నిజం లేదు అని ఇటీవల నిర్మాణం సంస్థ ద్వారా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ డేట్ మిస్ చేసుకోకూడదు అని కూడా చిత్ర యూనిట్ బలంగా ఫిక్స్ అయింది.

ఇక దర్శకుడు సుకుమార్ కూడా అందుకు తగ్గట్టుగా ప్రణాళికతో షూటింగ్లో పూర్తి చేస్తూ ఉన్నాడు. ఇప్పటికే సగానికి పైగా సినిమా షూటింగ్ పూర్తయింది. ఇక జూన్ చివరినాటికి సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులను పూర్తి చేయాలని అనుకుంటున్నారు. అలాగే పుష్ప 2 సినిమాను పాన్ ఇండియా రేంజ్ లోనే కాకుండా వివిధ దేశాలలో కూడా భారీ స్థాయిలో విడుదల చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు.