Begin typing your search above and press return to search.

రేవ్ పార్టీతో మాకెలాంటి సంబంధం లేదు!

హైద‌రాబాద్ లో ఉంటే బెంగుళూరులో ఉన్నామ‌ని ప్ర‌చారం ఏంటి? అని ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేసారు.

By:  Tupaki Desk   |   20 May 2024 12:40 PM GMT
రేవ్ పార్టీతో మాకెలాంటి సంబంధం లేదు!
X

బెంగుళూర్ రేవ్ పార్టీ ఉదయం నుంచి టాలీవుడ్ లో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. పార్టీలో ప‌లు ర‌కాల డ్ర‌గ్స్ వాడిన‌ట్లు పోలీసులు గుర్తించారు. ఈపార్టీలో తెలుగు టీవీ న‌టీన‌టులు, మోడ‌ళ్లు మొత్తంగా 100 మంది ప‌ట్టుబ‌డ్డ‌ట్లు వార్త‌లొస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఆ పార్టీలో న‌టి హేమ‌..న‌టుడు శ్రీకాంత్ కూడా ఉన్న‌ట్లు ప్ర‌చారం సాగింది. ఈ ప్ర‌చారాన్ని ఇద్ద‌రు వెంట‌నే ఖండించారు. హైద‌రాబాద్ లో ఉంటే బెంగుళూరులో ఉన్నామ‌ని ప్ర‌చారం ఏంటి? అని ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేసారు.

శ్రీకాంత్ మాట్లాడుతూ.. 'నేను హైద్రాబాద్‌లోనే ఉన్నాను. బెంగళూరు రేవ్ పార్టీకి వెళ్లలేదు. చూస్తున్నారుగా ఇది నా ఇల్లే. బెంగుళూరు రేవ్ పార్టీకి నేను వెళ్లిన‌ట్లు పోలీసులు అరెస్ట్ చేసిన‌ట్లు ఫోన్ కాల్స్ వ‌చ్చాయి. కొంతమంది మీడియా మిత్రులు ఫోన్ చేసి క్లారిటీ తీసుకున్నారు. నాకు సంబంధించిన వార్త‌ల‌ను వారు రాయ‌లేదు. ఆ న్యూస్ చూసి కుటుంబ స‌భ్యులంద‌రూ న‌వ్వుకున్నాం. మొన్న‌మో భార్య‌తో విడాకులు ఇప్పించేశారు. ఇప్పుడేమో రేవ్ పార్టీకెళ్లాన‌ని అంటున్నారు. అయితే ఈ రేవ్ పార్టీ వార్త‌లు రాసిన వాళ్లు తొంద‌ప‌డ‌టంలో త‌ప్పులేద‌నిపించింది.

ఎందుకంటే రేవ్ పార్టీలో దొరికిన‌ అత‌నెవ‌రో కానీ కొంచెం నాలాగే ఉన్నాడు. గ‌డ్డం ఉంది. ముఖం క‌వ‌ర్ చేసుకున్నాడు. అత‌న్ని చూసి నేనే షాక్ అయ్యా. కానీ అది నేను కాదు. నేను అని చెప్పినా న‌మ్మోద్దు. ఎందుకంటే నేను పార్టీల‌కు..ప‌బ్ ల‌కు వెళ్లే వ్య‌క్తిని కాదు. ఎప్పుడైనా బర్త్ డే పార్టీల‌కు వెళ్లినా కాసేపు ఉండి వ‌చ్చేస్తా. రేవ్ పార్టీ ఎలా ఉంటుందో కూడా తెలియ‌దు. మీడియా మిత్ర‌లు స‌హా ఎవ‌రూ న‌మ్మోద్దు. విష‌యం తెలియ‌కుండా రేవ్ పార్టీలో ప‌ట్టుబ‌డ్డ శ్రీకాంత్ అంటూ థంబ్ నెయిల్స్ పెడుతున్నారు. నాలాగే మీరు పొర‌బ‌డ‌న‌ట్లున్నారు అనుకుంటున్నా. అందుకే ఈ వీడియో రిలీజ్ చేస్తున్నా. ద‌య‌చేసి త‌ప్పుడు క‌థ‌నాలు న‌మ్మోద్దు' అని అన్నారు.

ఇక ఈ కేసులో న‌టి హేమ వ్య‌వ‌హారం స‌స్పెన్స్ గా మారింది. ఇప్ప‌టికే హేమ రేవ్ పార్టీకి వెళ్ల‌లేద‌ని...హైద‌రాబాద్ లో త‌న ఫామ్ హౌస్ లో ఉన్న‌ట్లు ఓ వీడియో రిలీజ్ చేసారు. కానీ క‌న్న‌డ మీడియాలో హేమ అక్క‌డ పోలీసుల అదు పులో ఉన్న‌ట్లు ఎన్టీవీ ఛాన‌ల్ పేర్కోంది. అయితే ఆమె వీడియో రిలీజ్ చేసిన కాసేప‌టికి అదే డ్రెస్ లో ఉన్న ఆమె ఫోటోని బెంగుళూరు పోలీసులు రిలీజ్ చేసిన‌ట్లు ఎన్టీవీలో మ‌రో వార్త వ‌చ్చింది.

అలాగే హేమ విడుద‌ల చేసిన వీడియో కూడా బెంగుళూరు ఫామ్ హౌస్ లో షూట్ చేసింద‌ని పోలీసులు చెబుతున్న‌ట్లు ఎన్టీవీ ఛాన‌ల్ చెబుతుంది . దీనికి సంబంధించి పోలీసులు మ‌రో ప్ర‌క‌ట‌న కూడా రిలీజ్ చేసిన‌ట్లు పేర్కోంది స‌ద‌రు మీడియా సంస్థ‌. హేమ వీడియో రిలీజ్ చేసిన స‌మ‌యంలో ఆమె బ్యాక్ గ్రౌండ్ లో క‌న‌బ‌డిన చెట్లు బెంగుళూరు ఫామ్ హౌస్ లో ఉన్న‌వేన‌ని ఓ ఫోటో రిలీజ్ చేసిన‌ట్లు ఎన్టీవీ ఛాన‌ల్ లో వార్త‌లొస్తున్నాయి.