Begin typing your search above and press return to search.

బెల్లంకొండ ఉగ్రం కోసం నాంది...!

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ప్రస్తుతం విజయ్ కనకమేడల సినిమాకు రెడీ అవుతున్నాడు.

By:  Tupaki Desk   |   30 Oct 2023 6:31 AM GMT
బెల్లంకొండ ఉగ్రం కోసం నాంది...!
X

అల్లరి నరేష్ అనగానే కామెడీ సినిమాలను ప్రేక్షకులు ఆశిస్తారు. అలాంటి అల్లరి నరేష్ తో సీరియస్ సినిమా ను ప్లాన్‌ చేయడం అంటే కచ్చితంగా సాహస నిర్ణయం. అలాంటి సాహస నిర్ణయాన్ని విజయ్ కనకమేడల తీసుకున్నాడు. అల్లరి నరేష్ తో నాంది అనే సీరియస్ స్టోరీ సినిమాను రూపొందించి సర్‌ ప్రైజ్ చేసిన విషయం తెల్సిందే.

నాంది సినిమా తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విజయ్ కనకమేడల అల్లరోడి కెరీర్ నే టర్న్‌ చేయడం జరిగింది. కామెడీ హీరోగా ఇన్నాళ్లు కొనసాగుతూ వస్తున్న అల్లరి నరేష్ పూర్తి స్థాయి సీరియస్ కథ లు మరియు యాక్షన్ కథలను చేయగలడు అని నాంది సినిమా తో నిరూపితం అయ్యింది.

అల్లరి నరేష్ తో విజయ్‌ కనకమేడల రెండో సినిమా 'ఉగ్రం' రూపొందించాడు. ఉగ్రం సినిమా కూడా పాజిటివ్‌ రెస్పాన్స్ దక్కించుకుంది. ఆ సినిమా విడుదల అయిన సమయంలో దర్శకుడు విజయ్ ని చాలా మంది ప్రశంసించారు. మంచి అభిరుచి ఉన్న దర్శకుడు... ప్రతిభావంతుడు అన్నట్లుగా కామెంట్స్ చేశారు. విజయ్‌ కనకమేడల ఇప్పుడు మూడో సినిమాకు రెడీ అవుతున్నాడు.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ప్రస్తుతం విజయ్ కనకమేడల సినిమాకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న సినిమాలు పూర్తి అయిన వెంటనే అంటే వచ్చే ఏడాది ఆరంభంలో విజయ్ కనకమేడల సినిమాలో నటించే అవకాశాలు ఉన్నాయి. వీరిద్దరి కాంబో మూవీ ని రాధామోహన్‌ నిర్మించబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది.

ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా ను, సాగర్ కే చంద్ర దర్శకత్వంలో ఒక సినిమాను బెల్లంకొండ బాబు చేస్తున్నాడు. ఆ రెండు సినిమాలు లైన్ లో ఉండగానే విజయ్ కనకమేడల దర్శకత్వంలో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ సినిమా వచ్చే ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో ఉగ్రం వంటి సినిమా కు నాంది పడింది అంటూ మేక్స్ క్లారిటీ ఇచ్చారు.