Begin typing your search above and press return to search.

బెల్లంకొండ కొత్త సినిమా... పవన్ కి లింక్‌!

సక్సెస్‌, ఫ్లాప్స్ లతో సంబంధం లేకుండా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు.

By:  Tupaki Desk   |   2 Jan 2024 7:40 AM GMT
బెల్లంకొండ కొత్త సినిమా... పవన్ కి లింక్‌!
X

బెల్లకొండ సాయి శ్రీనివాస్ జనవరి 3 అంటే రేపు పుట్టిన రోజు జరుపుకోబోతున్నాడు. ఈ సందర్భంగా నేడు మరియు రేపు ఆయన నటిస్తున్న సినిమాలకు సంబంధించిన సందడి సోషల్ మీడియాలో ఉండే విధంగా ఆయన పీఆర్‌ టీం ప్లాన్‌ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

సక్సెస్‌, ఫ్లాప్స్ లతో సంబంధం లేకుండా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. హిందీ చత్రపతి సినిమా నిరాశ పరిచిన కూడా ఇప్పుడు ఆయన చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి సాగర్ చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కాగా మరోటి మున్నా దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా.

ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సందడి చేసే విధంగా రూపొందుతున్నాయి అంటూ మేకర్స్‌ చెబుతున్నారు. సాగర్‌ చంద్ర సినిమా కి టైసన్‌ నాయుడు అనే విభిన్నమైన టైటిల్ ను ఖరారు చేయడం జరిగింది. రేపు ఆ టైటిల్ తో పోస్టర్ మరియు ఫస్ట్‌ లుక్ విడుదల అవ్వబోతుంది.

ఇక మున్నా దర్శకత్వంలో రూపొందుతున్న సోషియో ఫాంటసీ సినిమాకి గాను 'దేవుడే దిగి వచ్చినా' అనే టైటిల్ ను ఖరారు చేయడం జరిగింది. ఈ టైటిల్‌ ను పవన్‌, సాయి ధరమ్ తేజ్ కాంబోలో రూపొందిన సినిమా కు అనుకున్నారు. కానీ క్యాచీ టైటిల్ ఉండాలి అనే ఉద్దేశ్యంతో బ్రో ను ఖరారు చేయడం జరిగింది.

పవన్‌ టీం వదిలేసిన దేవుడే దిగి వచ్చినా టైటిల్ తో ఇప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమా ను చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ పోస్టర్‌ ను రేపు విడుదల చేసే విధంగా మేకర్స్ ప్లాన్‌ చేస్తున్నారు. మొత్తానికి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పుట్టిన రోజు హడావిడి ఓ రేంజ్ లో ఉండే అవకాశాలు ఉన్నాయి.