Begin typing your search above and press return to search.

డాక్టర్‌ గా బెల్లంకొండ 'నాంది' షురూ

విజయ్ కనకమేడల దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మూవీ నేటి నుంచి షూటింగ్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు పేర్కొన్నారు.

By:  Tupaki Desk   |   20 Jan 2024 12:30 PM GMT
డాక్టర్‌ గా బెల్లంకొండ నాంది షురూ
X

హిందీ చత్రపతి సినిమా తీవ్రంగా నిరాశ పరిచిన కూడా ఏమాత్రం ఇబ్బంది పడకుండా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన కొత్త సినిమాలను కంటిన్యూ చేస్తున్నాడు. ప్రస్తుతం టైసన్ నాయుడు సినిమాను చేస్తున్న ఈ బెల్లంకొండ హీరో మరో వైపు రమేష్ వర్మ తో రాక్షసుడు 2 సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే.

రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉండగానే మరో రెండు సినిమాలకు కమిట్ అయ్యి, వాటిల్లో ఒక సినిమా షూటింగ్ కూడా షురూ చేశాడు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మూవీ నేటి నుంచి షూటింగ్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు పేర్కొన్నారు.

నాంది వంటి విభిన్న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చి సామాజిక ఇతివృత్తంతో కూడా కమర్షియల్‌ హిట్ ను దక్కించుకున్న విజయ్ కనకమేడల దర్శకత్వంలో బెల్లంకొండ సినిమా చేయడం కచ్చితంగా కలిసి వచ్చే అవకాశం ఉన్నట్లు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమాలో మెహ్రీన్ కౌర్ హీరోయిన్‌ గా నటిస్తోంది. ఈ అమ్మడు ఆ మధ్య తెలుగు సినిమాల్లో బిజీ హీరోయిన్ గా సినిమాలు చేసింది. కానీ ఈ మధ్య పెద్దగా ఆఫర్లు రాలేదు. ఫేడ్‌ ఔట్‌ అవుతున్న సమయంలో బెల్లంకొండ, విజయ్‌ కనకమేడల సినిమా రూపంలో భలే ఛాన్స్ ఈ అమ్మడికి దక్కింది.

విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు దక్కించుకున్న విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందుతున్న బెల్లంకొండ మూవీ మరో నాంది వంటి కమర్షిల్ విజయాన్ని సొంతం చేసుకుంటుందని యూనిట్‌ సభ్యులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో బెల్లంకొండ ను డాక్టర్ పాత్రలో చూడబోతున్నామట. ఆరోగ్య శాఖ లో ఉన్న లోపాలను దర్శకుడు ఈ సినిమాలో చూపిస్తాడేమో చూడాలి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.