Begin typing your search above and press return to search.

అడవిలో రహస్యాల వెతికే బెల్లంకొండ శ్రీనివాస్.. 'కిష్కింధాపురి' ఫస్ట్ లుక్!

తాజాగా ఈ సినిమాకు 'కిష్కింధాపురి' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. టైటిల్ లుక్‌ని చూస్తేనే సినిమాలో ఓ మిస్టరీ, అడవిలోని ప్రాచీన రహస్యాల నేపథ్యంలో కథ నడుస్తుందని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   27 April 2025 1:28 PM IST
అడవిలో రహస్యాల వెతికే బెల్లంకొండ శ్రీనివాస్.. కిష్కింధాపురి ఫస్ట్ లుక్!
X

టాలీవుడ్ యాక్షన్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త ప్రయోగాలకు సిద్ధమయ్యాడు. గతంలో కమర్షియల్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను ఏర్పరచుకున్న శ్రీనివాస్, ఇప్పుడు ఓ హై బడ్జెట్ థ్రిల్లర్‌లో నటిస్తున్నారు. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సాహు గారపాటి, కౌశిక్ పెగళ్లపాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు పోస్టర్ అప్‌డేట్‌తో ప్రేక్షకుల్లో ఉత్కంఠను పెంచిన ఈ చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్‌తో ఇప్పుడు మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.

తాజాగా ఈ సినిమాకు 'కిష్కింధాపురి' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. టైటిల్ లుక్‌ని చూస్తేనే సినిమాలో ఓ మిస్టరీ, అడవిలోని ప్రాచీన రహస్యాల నేపథ్యంలో కథ నడుస్తుందని తెలుస్తోంది. అడవి నడుమ నైట్ టైంలో ల్యాంప్ పట్టుకొని ఏదో వెతుకుతున్న బెల్లంకొండ శ్రీనివాస్, అతని వెనక అనుపమ పరమేశ్వరన్ కూడా లైటర్ చేత పట్టుకుని ముందుకు సాగడం.. ఫస్ట్ లుక్ లో కనిపించింది. ఈ గెటప్, వాతావరణం సినిమా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌పై బలమైన హింట్ ఇచ్చింది.

బెల్లంకొండ శ్రీనివాస్ స్టైలిష్ అవతారంతో కనిపిస్తూ, తన క్యారెక్టర్‌లోని ఇంటెన్స్‌ను కళ్లతోనే చూపించే ప్రయత్నం చేశాడు. అడవి బ్యాక్‌డ్రాప్, ఆ పురాతన ప్యాలెస్ వాతావరణం ఈ కథలో ఎన్నో మిస్టరీలు దాగి ఉన్నాయనే ఫీలింగ్‌ను కలిగిస్తోంది. ఒకవైపు అడవి చీకటి, మరోవైపు వీరిద్దరూ ధైర్యంగా ముందుకు సాగడం.. ఏదో అద్వితీయమైన రహస్యాన్ని అన్వేషిస్తున్నట్లుగా ఫీలవుతోంది.

ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ కోసం మేకర్స్ చాలా హై టెక్నికల్ స్టాండర్డ్స్‌ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్‌లో మరో స్పెషల్ సినిమా అవుతుందని టాక్. ఇప్పటికే వచ్చిన పోస్టర్‌కి మంచి స్పందన రావడంతో, ఇప్పుడు మొదటి గ్లింప్స్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఏప్రిల్ 29న ఫస్ట్ గ్లింప్స్ విడుదల కానుంది. ఈ గ్లింప్స్ ద్వారా కథలో ఇంకెన్ని ట్విస్ట్‌లు ఉన్నాయో బయటపడనుండటంతో ఫ్యాన్స్‌లో ఆతృత పెరిగింది.

ప్రస్తుతం టాలీవుడ్‌లో మిస్టరీ థ్రిల్లర్స్‌కు మంచి మార్కెట్ ఉంది. అలా చూస్తే, 'కిష్కింధాపురి' కూడా ఆ కేటగిరీలో కొత్త హైప్‌ను క్రియేట్ చేసే అవకాశం కనిపిస్తోంది. అడవిలోని ఓ రహస్య ప్రదేశాన్ని వెతుకుతూ జరగబోయే ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే.. మే నెలలో రాబోయే అప్‌డేట్స్ కోసం వేచి చూడాల్సిందే.