బెల్లంకొండ జంట.. ట్రేండింగ్ లో పెర్ఫెక్ట్ క్యూట్ కపుల్..
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రీసెంట్ గా వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 1 May 2026 4:43 PM ISTటాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రీసెంట్ గా వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తన ప్రేయసి కావ్య రెడ్డిని పెళ్లి చేసుకోవడంతో ఆ జంట ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా వీరిద్దరి మధ్య జరిగిన చిన్న చిన్న ఫన్నీ ఇన్సిడెంట్స్ నెటిజన్లను ఆకట్టుకుంటూ వైరల్ అవుతున్నాయి. క్యూట్ కపుల్ అంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
హిందూ సంప్రదాయం ప్రకారం.. కొత్తగా పెళ్లైన జంట ఇంట్లోకి అడుగుపెట్టేముందు తమ పేర్లు చెప్పడం ఆనవాయితీ. ఈ సందర్భంగా కావ్య రెడ్డి ఎంతో ముద్దుగా రెస్పాండ్ అయ్యారు. "నేను కావ్య బెల్లంకొండ.. మా వారు సాయి శ్రీనివాస్ బెల్లంకొండతో మా ఇంటికి కొత్త కోడలిగా వచ్చాను" అని చెప్పడంతో అక్కడున్న కుటుంబ సభ్యులు ఆనందంతో చప్పట్లు కొట్టారు. ఆమె అమాయకంగా చెప్పిన మాటలు వీడియో రూపంలో నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఆ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ ను కూడా అదే విధంగా చెప్పమని కుటుంబ సభ్యులు కోరారు. మొదట సరదాగా "మా ఇంటికి మా ఆవిడను తీసుకొచ్చాను. మీరంతా జరగండి" అంటూ నవ్వులు పూయించారు. అనంతరం అందరూ మళ్లీ చెప్పమని అడగడంతో, తన భార్య ప్రేమగా పిలిచే పేరు కూడా బయటపడింది. కావ్య 'చెప్పు శ్రీని' అని ముద్దుగా అనడంతో, ఆయన 'నా భార్య కావ్య బెల్లంకొండతో మా ఇంటికి వచ్చా... నా పేరు అల్లుడు శీను' అంటూ చెప్పి అందరినీ అలరించారు. ఆ వీడియో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది.
ఇదిలా ఉంటే, పెళ్లి అనంతరం ఆ జంట తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి స్వామి దర్శనం చేసుకుంది. అక్కడ మీడియా వారిని పలకరించగా, తన భార్యను మాట్లాడమని శ్రీనివాస్ ఎంతో క్యూట్ గా అడిగారు. అయితే కావ్య మాత్రం 'ప్లీజ్ శ్రీని వద్దు' అంటూ సిగ్గుపడుతూ రెస్పాండ్ అయ్యారు. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో పర్ఫెక్ట్ క్యూట్ కపుల్ అంటూ సినీ ప్రియులు కామెంట్లు పెడుతున్నారు.
గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఆ జంట, ఏప్రిల్ 29 రాత్రి తిరుమలలో గ్రాండ్ గా వివాహం చేసుకున్నారు. వేద మంత్రాల మధ్య రాత్రి 11:05 గంటలకు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఆ పెళ్లి వేడుకకు ఇరు కుటుంబాల పెద్దలు, సన్నిహితులు, స్నేహితులతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. కావ్య రెడ్డి హైదరాబాద్ కు చెందినవారు కాగా.. ఆమెకు సినీ ఇండస్ట్రీతో సంబంధం లేకపోయినా, ప్రముఖ న్యాయవాది కుమార్తెగా గుర్తింపు ఉంది.
ఇక శ్రీనివాస్ ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడు. అల్లుడు శీను సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన.. జయ జానకి నాయక, రాక్షసుడు వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆ కొత్త జంటకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులతో పాటు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మే 1న హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఏదేమైనా బెల్లంకొండ శ్రీనివాస్- కావ్య జంట తమ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో అభిమానులను ఆకట్టుకుంటూ ట్రెండింగ్ కపుల్ గా నిలుస్తోంది.
