అల్లు అర్జున్‌కు వెడ్డింగ్ ఇన్విటేషన్ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్
తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను కలిసి వెడ్డింగ్ కార్డ్ అందించారు. ఈ సందర్భంగా దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్నాయి.
By: Madhu Reddy | 27 April 2026 5:42 PM ISTటాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇంట్లో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. తన ప్రేయసి కావ్యారెడ్డితో కలిసి ఈ నెల 29న తిరుమల కొండపై ఆయన ఏడడుగులు వేయబోతున్నారు. ఈ సందడిలో భాగంగా బెల్లంకొండ కుటుంబం సినీ, రాజకీయ ప్రముఖులను ఆహ్వానిస్తోంది. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను కలిసి వెడ్డింగ్ కార్డ్ అందించారు. ఈ సందర్భంగా దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్నాయి.
ఐకాన్ స్టార్‌తో బెల్లంకొండ ఫ్యామిలీ:
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన తండ్రి సురేష్‌తో కలిసి అల్లు అర్జున్ నివాసానికి వెళ్లారు. అక్కడ బన్నీని మర్యాదపూర్వకంగా కలిసి తన పెళ్లి పత్రికను అందించారు. ఈ నెల 29న తిరుమలలో జరిగే వివాహ వేడుకకు కుటుంబ సమేతంగా రావాలని కోరారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ సాయి శ్రీనివాస్‌కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపి, కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నందుకు శుభాకాంక్షలు అందించారు.
వరుసగా దిగ్గజాల కలయిక:
ఇక కేవలం అల్లు అర్జున్ మాత్రమే కాదు, గత కొన్ని రోజులుగా బెల్లంకొండ ఫ్యామిలీ టాలీవుడ్ పెద్దలందరినీ కలుస్తోంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవిని, కింగ్ నాగార్జునను కలిసి ఆహ్వాన పత్రికలు అందజేశారు. వారి ఆశీస్సులు తీసుకున్న ఫోటోలు కూడా నెట్టింట సందడి చేశాయి. ఇండస్ట్రీలో అందరితో మంచి సంబంధాలు ఉన్న బెల్లంకొండ సురేష్, తన కొడుకు పెళ్లిని చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇక ఏపీ, తెలంగాణ రాజకీయ నాయకులు కూడా ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. దీనివల్ల ఈ పెళ్లి వేడుక సినీ, రాజకీయ సంగమంగా మారబోతోంది.
తిరుమలలో వివాహ వేడుక:
ఈ నెల 29న కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి సాక్షిగా తిరుమల కొండపై సాయి శ్రీనివాస్, కావ్యారెడ్డిల వివాహం జరగనుంది. ఇక తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి కొడుకు వేడుక ని నిర్వహించారు. ఇందులో శ్రీనివాస్ రాజసం ఉట్టిపడే లుక్‌లో కనిపించారు. ఇక ఇప్పటికే తిరుమలలో పెళ్ళికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. అత్యంత సన్నిహితులు, కొద్దిమంది ప్రముఖుల మధ్య ఈ వేడుక శాస్త్రోక్తంగా జరగనుంది. సమ్మర్ సెలవుల సమయంలో తిరుమలలో పెళ్లి కావడంతో అభిమానుల తాకిడి కూడా ఎక్కువే ఉండేలా కనిపిస్తోంది.
మొత్తానికి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఒక ఇంటివాడు కాబోతుండటం టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది. అల్లు అర్జున్ లాంటి స్టార్స్‌ను స్వయంగా వెళ్లి ఆహ్వానించడం చూస్తుంటే పెళ్లి వేడుక ఎంత సందడిగా ఉండబోతుందో అర్థమవుతోంది. కొత్త జంటకు ముందుగానే అభిమానులు సోషల్ మీడియా వేదికగా విష్ చేస్తున్నారు. మరి తిరుమల కొండపై జరగనున్న ఈ పెళ్లి వేడుకలో ఇంకెంతమంది స్టార్స్ మెరుస్తారో వేచి చూడాలి!
