భార్యపై అలాంటి కామెంట్స్ చేసిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్!
ఈ ఏడాది టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోలు బ్యాచిలర్ లైఫ్ వీడి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు.
By: Tupaki Desk | 2 May 2026 10:17 AM ISTఈ ఏడాది టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోలు బ్యాచిలర్ లైఫ్ వీడి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. అందులో భాగంగానే విజయ్ దేవరకొండ , అల్లు శిరీష్ వైవాహిక బంధం లోకి అడుగుపెట్టగా.. ఇప్పుడు మరో హీరో కూడా పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఆయన ఎవరో కాదు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అల్లుడు శీను సినిమాతో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. అద్భుతమైన నటనతో, అమాయకత్వంతో అందరి దృష్టిని ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గత రెండు సంవత్సరాలుగా ప్రేమలో మునిగి తేలారు. కానీ ఈ విషయాన్ని ఎక్కడ ఎవరితోనూ పంచుకోలేదు. కానీ ఈ ఏడాది సడన్గా కావ్య రెడ్డి అనే అమ్మాయితో ప్రీ ఎంగేజ్మెంట్ ఫోటోషూట్ నిర్వహించి తాను ప్రేమించిన అమ్మాయితో ఏడడుగులు వేయబోతున్నాను అంటూ అభిమానులకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు.
ఇక తర్వాత కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినిమా ప్రముఖుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్న ఈయన.. ఎట్టకేలకు ఏప్రిల్ 29 బుధవారం రాత్రి 11:05 గంటలకు తన ప్రేయసి కావ్య రెడ్డి మెడలో మూడు ముళ్ళు వేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి ఆశీస్సులతో కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు , రాజకీయ నాయకుల సమక్షంలో తన ప్రేయసికి భార్యగా హోదా కల్పించారు. ఈ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు నూతన జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇకపోతే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అధికారికంగా తమ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలని షేర్ చేస్తూ తన భార్యపై చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
పెళ్లి తంతు కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ.." నేను నిర్మించుకున్న వాటన్నింటి మధ్యలో అన్నింటికంటే ఒక గొప్ప దాన్ని నేను కనుగొన్నాను. ప్రపంచమా.. ఇక నా భార్యను కలుసుకో.. నా పెళ్ళాం నిప్పురా" అంటూ కొటేషన్ షేర్ చేశాడు. మొత్తానికి అయితే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన భార్య నిప్పు అంటూ పంచుకున్న ఈ క్యాప్షన్ అభిమానులను ఆకట్టుకుంటుంది.
ఇకపోతే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ షేర్ చేసిన ఈ ఫోటోలకు ప్రముఖ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కామెంట్ చేసింది. ప్రియమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , కావ్య రెడ్డి దంపతులకు నా హృదయపూర్వక అభినందనలు. మీరు జీవితాంతం ఇలాగే ప్రేమ, ఐక్యత, ఆనందంతో నిండి ఉండాలని కోరుకుంటున్నాను. ఈ చిత్రాలలో మీరు ఎంత ముద్దుగా ఉన్నారో అంటూ కామెంట్లు చేసింది. ఇక కావ్య రెడ్డి విషయానికి వస్తే.. కావ్య రెడ్డి సినిమా రంగానికి చెందినవారు కాదు. ఈమె ఒక ఉన్నత న్యాయ కుటుంబానికి చెందినవారు. ఈమె తాతగారు జడ్జి కాగా.. తండ్రిగారు లాయర్. మొత్తానికైతే రెండు సంవత్సరాలుగా ప్రేమించుకున్న ఈ జంట ఇప్పుడు పెద్దల సమక్షంలో పెళ్లి పేరుతో ఒక్కటి అయ్యారు.
