Begin typing your search above and press return to search.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ని ముద్దుగా కావ్య ఏమని పిలుస్తుందో తెలుసా?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా గుర్తింపు తెచ్చుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. ఎట్టకేలకు మూడు ముళ్ళు , ఏడు అడుగులతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు.

By:  Tupaki Desk   |   2 May 2026 11:02 AM IST
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ని ముద్దుగా కావ్య ఏమని పిలుస్తుందో తెలుసా?
X

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా గుర్తింపు తెచ్చుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. ఎట్టకేలకు మూడు ముళ్ళు , ఏడు అడుగులతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ప్రముఖ ఉన్నత న్యాయ కుటుంబానికి చెందిన కావ్య రెడ్డితో తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో.. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు, సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఏడడుగులు వేశారు. ఈ జంటకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ఇకపోతే అభిమానులు #Srinivasakavyanam పేరుతో ఈ జంటకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నెటిజన్స్ ను ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే వివాహం అనంతరం హైదరాబాదుకు చేరుకున్న ఈ జంట బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తొలిసారి తన భార్యను తీసుకొని తన ఇంటికి వచ్చారు. ఇక అలా ఇంట్లోకి కొత్త జంట అడుగుపెట్టేటప్పుడు హిందూ సాంప్రదాయం ప్రకారం ఒకరికొకరు పేర్లు చెప్పి ఇంట్లోకి రావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అటు కావ్య ఇటు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇద్దరూ కూడా చేసిన కామెంట్లు అభిమానులను చాలా ఆకట్టుకుంటున్నాయి.

ఇందులో ముఖ్యంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ని ఆయన భార్య కావ్య ముద్దుగా ఏమని పిలుస్తుందో తెలిసి అందరూ తెగ మురిసిపోతున్నారు. ఇంట్లోకి కొత్త కోడలు అడుగుపెడుతున్న సమయంలో పేర్లు చెప్పి ఇంట్లోకి రావాలి అని బంధువులు అడగగా.. ముందుగా కావ్య మాట్లాడుతూ "నేను కావ్య బెల్లంకొండ.. మా ఆయన సాయి శ్రీనివాస్ బెల్లంకొండతో మా ఇంటికి కొత్త కోడలిగా వచ్చాను" అంటూ చాలా క్యూట్గా చెప్పింది.ఇక బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో ఇప్పుడు మీరు చెప్పాలి అని అడగ్గా .. నేనా మా ఆవిడతో మా ఇంటికి వచ్చాను అని ఆయన చాలా సింపుల్ గా చెప్పేశారు. కానీ అక్కడ హారతి పళ్ళెం పట్టుకున్న అమ్మాయిలు వదలలేదు.. వెంటనే కావ్య.. శ్రీనివాస్ వైపు చూస్తూ చెప్పు "శ్రీనీ "అంటూ ముద్దుగా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో అంటుంది.

ఇక ఆ క్షణానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కావ్య తన భర్తను ముందుగా ఇలా పిలుస్తోందా అంటూ సంబరపడిపోతున్నారు అభిమానులు. ఇకపోతే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాత్రం తనను తాను అల్లుడు శ్రీను అని పరిచయం చేసుకోవడం ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. మొత్తానికైతే తన మొదటి సినిమాని ఇప్పుడు వైవాహిక బంధం లోకి అడుగు పెట్టిన వెంటనే తన పేరుగా మార్చుకొని అందరిని సర్ప్రైజ్ చేశారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్.

ఇక బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాల విషయానికి వస్తే హైందవ, టైసన్ నాయుడు అనే రెండు చిత్రాలలో ఆయన నటిస్తున్నారు.