Begin typing your search above and press return to search.

శ్రీనివాస్ ఆశ‌ల‌న్నీ వాటిపైనే!

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త‌న ప్రైమ్ టైమ్ లో మూడేళ్ల విలువైన స‌మ‌యాన్ని ఛ‌త్ర‌ప‌తి హిందీ రీమేక్ కోసం వేస్ట్ చేసుకున్నాడు.

By:  Tupaki Desk   |   6 Jun 2025 12:15 AM IST
శ్రీనివాస్ ఆశ‌ల‌న్నీ వాటిపైనే!
X

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త‌న ప్రైమ్ టైమ్ లో మూడేళ్ల విలువైన స‌మ‌యాన్ని ఛ‌త్ర‌ప‌తి హిందీ రీమేక్ కోసం వేస్ట్ చేసుకున్నాడు. ఛ‌త్ర‌ప‌తి రీమేక్ తో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుని బాలీవుడ్ లో జెండా పాతాల‌ని చూసిన బెల్లంకొండ శ్రీనివాస్ కు ఆ సినిమా తీవ్ర నిరాశ‌ను మిగిల్చింది. ఛ‌త్రప‌తి రీమేక్ కోసం శ్రీనివాస్ పెట్టిన ఎఫర్ట్స్ మొత్తం బూడిద‌లో పోసిన ప‌న్నీరైంది.

దీంతో కొన్నాళ్ల పాటూ మంచి సినిమా చేయాల‌నే ఆలోచ‌న‌తో వెయిట్ చేసిన బెల్లంకొండ శ్రీనివాస్ చేసేదేమీ లేక రెండేళ్ల త‌ర్వాత‌ తిరిగి టాలీవుడ్ కు వ‌చ్చి ఇక్క‌డ సినిమాలను చేస్తున్నాడు. రీసెంట్ గానే శ్రీనివాస్ హీరోగా భైర‌వం అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమాలో నారా రోహిత్, మంచు మ‌నోజ్ తో క‌లిసి శ్రీనివాస్ న‌టించాడు.

భైర‌వం సినిమా త‌న కెరీర్ కు మంచి కం బ్యాక్ ఇస్తుంద‌నుకుని ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నాడు శ్రీనివాస్. కానీ భైర‌వం సినిమా ఆశించిన ఫ‌లితాన్ని అందుకోలేక‌పోయింది. భైర‌వం రిజ‌ల్ట్ తేలిపోయింది. ఈ సినిమా క‌నీస ఖ‌ర్చుల‌ను కూడా తిరిగి రాబ‌ట్టుకోలేద‌నే విష‌యం స్ప‌ష్టమైంది. శ్రీనివాస్ న‌టించిన గ‌త సినిమాల కంటే భైర‌వం కాస్త మెరుగ్గా ఉన్న‌ప్ప‌టికీ, ఆడియ‌న్స్ లో మాత్రం ఈ సినిమా ఇంట్ర‌స్ట్ ను క‌లిగించ‌లేకపోయింది.

దీంతో క్ర‌మంగా ఫ‌స్ట్ వీకెండ్ త‌ర్వాత బాక్సాఫీస్ వ‌ద్ద భైర‌వం బాగా డ‌ల్ అయింది. అయితే భైర‌వం సినిమా ఫ్లాపైన‌ప్ప‌టికీ శ్రీనివాస్ చేతిలో ప‌లు ప్రాజెక్టుల‌నున్నాయి. భీమ్లా నాయ‌క్ ఫేమ్ సాగ‌ర్ కె. చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో టైస‌న్ నాయుడు అనే యాక్ష‌న్ డ్రామా చేస్తున్న శ్రీనివాస్, కౌశిక్ పెగిళ్ల‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో కిష్కింధ‌పురి అనే హార్ర‌ర్ థ్రిల్ల‌ర్ చేస్తున్నాడు. దీంతో పాటూ లుధీర్ బైరెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో హైంధ‌వ అనే డివోష‌న‌ల్ సినిమాను కూడా లైన్ లో పెట్టాడు శ్రీనివాస్. ఈ మూడు ప్రాజెక్టుల్లో క‌నీసం రెండు సినిమాలైనా హిట్ అవుతాయని, వాటితో తిరిగి టాలీవుడ్ లో త‌న మార్కెట్ ను నిల‌బెట్టుకుంటాన‌ని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.