తారక్ అన్న స్పూర్తితోనే బెల్లంకొండ వారసుడు!
ఆ విషయంలో నాకు తారక్ అన్న స్పూర్తి. విజయానికి పొంగిపోకూడు. అపజయానికి కృంగిపోకూడదు అన్నది బాగా అర్దమైంది.
By: Tupaki Desk | 25 July 2025 8:00 AM ISTసక్సస్ కోసం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఎలాంటి పోరాటం చేస్తున్నాడో తెలిసిందే. `అల్లుడు శీను` తో పరిచయమైన శ్రీనివాస్ హీరోగా చాలా సినిమాలు చేసాడు. వాటిలో సక్సెస్ మాత్రం చాలా తక్కువే కనిపి స్తుంది. `రాక్షసుడు` తప్ప మిగతా సినిమాలేవి ఆశించిన ఫలితాన్ని అందించలేదు. మధ్యలో `జయ జానకి నాయక` యావరేజ్ గా ఆడింది. హీరో కటౌట్. అన్ని రకాల అర్హతులున్నాయి. కానీ సక్సస్ మాత్రం రావడం లేదు. అయినా శ్రీనివాస్ నమ్మకం కోల్పోకుండా ప్రయత్నాలు చేస్తున్నాడు.
మరి ఈ విషయంలో శ్రీనివాస్ కు స్పూర్తి ఎవరు? అంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్న అంటూ శ్రీనివాస్ రివీల్ చేసాడు. `తారక్ అన్న చిన్న వయసులోనే ఎన్నో విజయాలు చూసాడు. స్టార్ హోదా కి రీచ్ అ య్యాడు. వరుసగా ఐదారు హిట్లు తర్వాత కొన్ని పరాజయాలు ఎదురయ్యాయి. `సింహాద్రి` తర్వాత వరుస పరా జయాలు ఎదుర్కున్నాడు. మధ్యలో `యమదోంగ` అన్నది చిన్న హై ఇచ్చింది. ఆ తర్వాత మళ్లీ `అదుర్స్` వరకూ ప్లాప్ లే. ఇలా విజయం ...అపజయాన్ని ఆయన ఎంతో గొప్పగా బ్యాలెన్స్ చేసుకుంటూ కెరీర్ ని బిల్డ్ చేసుకున్నారు.
ఆ విషయంలో నాకు తారక్ అన్న స్పూర్తి. విజయానికి పొంగిపోకూడు. అపజయానికి కృంగిపోకూడదు అన్నది బాగా అర్దమైంది. అన్ని రకాల ఎమోషన్స్ ను బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాను` అన్నాడు. ఇటీవలే `భైరవం` సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కానీ ఈ సినిమా కూడా నిరాశనే మిగిల్చింది. ప్రస్తుతం `టైసన్ నాయుడు`, `హైందవం`, `కిష్కిందాపురి` చిత్రాల్లో నటిస్తున్నాడు.
ఈ మూడు సినిమాలు ఆన్ సెట్స్ లో ఉన్నాయి. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి కావాలి. కానీ అనివార్య కారణ లతో డిలే ప్రాజెక్ట్ లుగా కనిపిస్తున్నాయి. అలాగే కొన్ని కొత్త కథలు కూడా విని లైన్ లో పెట్టాడు. ఈ మూడు సినిమాల రిలీజ్ అనంతరం వాటి వివరాలు ప్రకటించే అవకాశం ఉంది. `ఛత్రపతి` రీమేక్ తో శ్రీనివాస్ బాలీవుడ్ లో కూడా లాంచ్ అయిన సంగతి తెలిసిందే.
