Begin typing your search above and press return to search.

తెలుగు హీరోపై కేసు నమోదు..!

టాలీవుడ్‌ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇటీవల రోడ్డు మీద రాంగ్ రూట్‌లో వెళ్తు, అడ్డు వచ్చిన కానిస్టేబుల్‌ పై దురుసుగా ప్రవర్తించిన వార్తలు వచ్చిన విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   15 May 2025 1:45 PM IST
తెలుగు హీరోపై కేసు నమోదు..!
X

టాలీవుడ్‌ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇటీవల రోడ్డు మీద రాంగ్ రూట్‌లో వెళ్తు, అడ్డు వచ్చిన కానిస్టేబుల్‌ పై దురుసుగా ప్రవర్తించిన వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సైతం వైరల్‌ అయ్యాయి. సోషల్‌ మీడియాలో నిన్నంత ఈ విషయం గురించి ప్రముఖంగా ప్రచారం జరిగింది. అతడు హీరో కాబట్టి అంతగా చేస్తున్నారు, ప్రతి రోజు సామాన్యులు ఎన్నో చోట్ల అలాంటి ట్రాఫిక్‌ రూల్స్‌కి విరుద్దంగా వెళ్తూ ఉంటారు. అయినా వారిని పట్టించుకోకుండా సెలబ్రిటీలను మాత్రమే సోషల్‌ మీడియాలో కొందరు కావాలని ఇలాంటివి చేస్తారు అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేశారు.

కొందరు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కి మద్దతుగా నిలిస్తే, కొందరు మాత్రం ఆయన్ను విమర్శించారు. గౌరవ ప్రదమైన హోదాలో ఉన్న బెల్లంకొండ శ్రీనివాస్ ఇలా చేయడం ఏంటి అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరించారు. రాంగ్‌ రూట్‌లో కారు డ్రైవ్‌ చేసినందుకు గాను బెల్లంకొండ పై కేసు నమోదు అయింది. ఇది అంత కఠినమైన కేసు ఏమీ కాదు. కానీ హీరో మీద కేసు అని మాత్రం ప్రముఖంగా సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ట్రాఫిక్ కానిస్టేబుల్‌ తో బెల్లంకొండ దురుసుగా ప్రవర్తించాడనే వార్తలు వచ్చాయి. కానీ అదేం లేదని చెప్పాడని తెలుస్తోంది.

ఇక బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన 'భైరవం' సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. మే 30న విడుదల కాబోతున్న ఈ సినిమాలో మంచు మనోజ్‌ సైతం నటించడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. భైరవం తర్వాత టైసన్‌ నాయుడు, హైందవ, కిష్కిందపూరి సినిమాలను చేస్తున్న విషయం తెల్సిందే. ఇదే ఏడాదిలో బెల్లంకొండ మరో సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. హిందీలో వచ్చిన చత్రపతి సినిమా బాక్సాఫీస్‌ వద్ద తీవ్ర నిరాశను కలిగించింది. కనుక ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుంది అనేది చూడాలి.