Begin typing your search above and press return to search.

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

ఈ సినిమా నుంచి మొదటి పాటగా 'మదరాసి రబ్బరు బొమ్మ'ను విడుదల చేయబోతున్నారు. పోస్టర్ చూస్తుంటే బెల్లంకొండ నుంచి మరో భారీ డ్యాన్స్ నంబర్ రాబోతున్నట్లు ఉంది.

By:  M Prashanth   |   4 Nov 2026 1:33 PM IST
బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!
X

బెల్లంకొండ శ్రీనివాస్ తన సినిమాల్లో డ్యాన్స్, యాక్షన్‌తో ఎక్కువ హైలెట్ అవుతుంటాడు. ముఖ్యంగా మాస్ సాంగ్స్‌లో అతను స్టెప్పులకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇప్పుడు 'టైసన్ నాయుడు' కోసం కూడా అదే రూట్ ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. ఈ సినిమా నుంచి మొదటి పాటగా 'మదరాసి రబ్బరు బొమ్మ'ను విడుదల చేయబోతున్నారు. పోస్టర్ చూస్తుంటే బెల్లంకొండ నుంచి మరో భారీ డ్యాన్స్ నంబర్ రాబోతున్నట్లు ఉంది.

సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు. తొలి పాట పోస్టర్‌లో ఇద్దరినీ మాస్ అవతారంలో చూపించారు. రంగురంగుల సెట్స్, బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్లు చూస్తుంటే పాటను భారీగానే తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా బెల్లంకొండ, నేహా మధ్య కెమిస్ట్రీని హైలైట్ చేసేలా పోస్టర్ డిజైన్ చేశారు. ఇద్దరూ కలిసి చేస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ పాటపై ఆసక్తి ఉండే అవకాశం ఉంది.

బెల్లంకొండ కెరీర్‌లో డ్యాన్స్‌కు ఎప్పుడూ స్పెషల్ బజ్ ఉంది. 'అల్లుడు శీను' నుంచి ఆయన సినిమాల్లో భారీ సాంగ్స్ కనిపిస్తూనే ఉన్నాయి. కథలు, పాత్రలు మారుతున్నప్పటికీ డ్యాన్స్ విషయంలో మాత్రం తన స్టైల్ కొనసాగిస్తున్నారు. ఇప్పుడు 'టైసన్ నాయుడు'లోనూ ఆ గుర్తింపును ఉపయోగించుకుంటున్నట్లు ఉంది. ఫస్ట్ పాటనే మాస్ ఫోక్ నంబర్‌గా తీసుకురావడం హైలెట్.

ఇక ఈ పాటకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించడం మరో ప్లస్. ఫోక్ బీట్స్‌తో మంచి ఎనర్జీ తీసుకురావడంలో ఆయనకు పేరుంది. బెల్లంకొండ డ్యాన్స్‌కు అలాంటి సంగీతం తోడైతే మంచి మాస్ నంబర్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా పాటలో క్యాచీ హుక్ స్టెప్ ఉంటే సోషల్ మీడియాలోనూ ఉపయోగపడుతుంది. ప్రస్తుతం సినిమా పాటలకు రీల్స్ ద్వారా లభించే బజ్ కూడా కీలకంగా మారింది.

అయితే 'టైసన్ నాయుడు' యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా. బెల్లంకొండను పవర్‌ఫుల్ పాత్రలో చూపించబోతున్నట్లు గతంలో విడుదలైన కంటెంట్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. అలాంటి సినిమా ప్రమోషన్స్‌ను యాక్షన్ సన్నివేశాలతో కాకుండా డ్యాన్స్ నంబర్‌తో ముందుకు తీసుకెళ్లడం ఆసక్తికరం. ఆయనలోని మాస్ డ్యాన్సర్‌ను మరోసారి ప్రేక్షకులకు గుర్తుచేసేలా ప్లాన్ చేస్తున్నట్లు అనిపిస్తోంది.

14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో ఇప్పుడు పాటల హడావుడి మొదలవుతోంది. నవంబర్ 5న సాయంత్రం 4:05 గంటలకు 'మదరాసి రబ్బరు బొమ్మ' ప్రోమో విడుదల కానుంది. నవంబర్ 6న పూర్తి పాటను తీసుకురానున్నారు. బెల్లంకొండ, నేహా శెట్టి డ్యాన్స్ కాంబినేషన్‌తో పాటు భీమ్స్ అందించిన ఫోక్ బీట్ ఎలా ఉంటుందనేది చూడాలి.